మెగా ప్రిన్స్ కొత్త లుక్ అదిరిపోయిందిగా.. ముఖంలో యువరాజు కళ, తన గ్యాంగ్‌తో చివరి రోజు!
Recommended Video

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో బిజీగా మారిపోయాడు. వరుణ్ తేజ్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు చిత్రాలలో రొమాంటిక్ హీరోగా నటించిన వరుణ్, ఈ చిత్రంతో ప్రయోగం చేయబోతున్నాడు. అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో ఈ చిత్రం స్పేస్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబందించిన పలు ఆసక్తికర విషయాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజగా వరుణ్ తేజ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పిక్ వైరల్ గా మారింది.
ఆ ముఖంలో కళ చూశారా
వరుణ్ తేజ్ ఈ చిత్రంలో మరింత హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ట్విట్టర్ లో పోస్ట్ చేసిన పిక్ లో వరుణ్ తేజ్ సరి కొత్త లుక్ షాక్ ఇచ్చే విధంగా ఉంది. ఈ చిత్రం కోసం వరుణ్ మీసాలు పెంచుతున్నాడు. వరుణ్ ముఖంలో కళ చూస్తే నిజంగా ప్రిన్స్ అనాల్సిందే.

స్టంట్ టీం ఆధ్వర్యంలో
ఈ చిత్రంలో హాలీవుడ్ తరహా స్టంట్స్ ఉండబోతున్నాయి. స్వయంగా హాలీవుడ్ నుంచి వచ్చిన స్టంట్ టీం ఆధ్వర్యంలో ఈ చిత్ర షూటింగ్ జరిగింది. వరుణ్ చేత వీరు కొన్ని అద్భుతమైన స్టంట్స్ చేయించారట. ఆ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కావడంతో హాలీవుడ్ స్టంట్ టీం స్వదేశానికి పయనమయ్యారు.

చివరి రోజు తన గ్యాంగ్‌తో
వారితో చివరి రోజు గడిపిన పిక్ ని వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వాళ్ళతో కలసి పనిచేయడం మధురమైన అనుభూతి అని వరుణ్ తేజ్ తెలిపాడు.

ఇద్దరు భామలతో
వరుణ్ తేజ్ సరసన ఈ చిత్రంలో అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఘాజి తరువాత సంకల్ప్ రెడ్డి, రెండు వరుస విజయాల తరువాత వరుణ్ తేజ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


Click it and Unblock the Notifications











