twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సర్‌గా మెగాప్రిన్స్ వరుణ్ తేజ్.. డైరెక్టర్, నిర్మాత ఎవరో తెలుసా!

    |

    మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ వరుణ్ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. పరిణితి చెందిన నటనతో ప్రతి చిత్రంలో వైవిధ్యాన్ని కనబరుస్తున్నాడు. కంచె చిత్రంలో వరుణ్ తేజ్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత ఫిదా, తొలిప్రేమ లాంటి చిత్రాలతో వరుణ్ కమర్షియల్ గా విజయం సాధించాడు. మరోమారు అంతరిక్షం చిత్రంతో వరుణ్ తేజ్ ప్రయోగాల బాటపట్టారు.

     విభిన్నమైన చిత్రాలు

    విభిన్నమైన చిత్రాలు

    వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమాలకు, ఎంచుకుంటున్న కథలకు ప్రశంసలు దక్కుతున్నాయి. అంతరిక్షం చిత్రం ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. స్పేస్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని సంకల్ప్ రెడ్డి తెరకెక్కించారు. వరుణ్ తేజ్ వ్యోమగామిగా అద్భుతమైన పెర్ఫామెన్స్ అందించాడని అంటున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. సంక్రాంతికి ఎఫ్2 చిత్రంతో రాబోతున్నాడు. ఇదిలా ఉండగా మరో క్రేజీ చిత్రాన్ని వరుణ్ లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

    బాక్సర్‌గా మెగాప్రిన్స్

    బాక్సర్‌గా మెగాప్రిన్స్

    వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రంలో బాక్సర్ గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో వరుణ్ బాక్సింగ్ తో అదరగొట్టబోతున్నాడని సమాచారం. దీనితో వరుణ్ తేజ్ విభిన్న కథలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నాడు. పొడవుతో అరడుగులకుపైనే ఉండే వరుణ్ బాక్సింగ్ లుక్ లో అదిరిపోతాడని మెగా అభిమానులు అంచనా వేస్తున్నారు.

    నిర్మాతగా అల్లువారబ్బాయి

    నిర్మాతగా అల్లువారబ్బాయి

    ఈ చిత్రానికి అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. బాబీ సొంతంగా ఓ బ్యానర్ ని స్థాపించబోతున్నాడని ఆ బ్యానర్ లోనే ఈ చిత్రం రూపొందుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక కిరణ్ అనే డెబ్యూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

     వరుస సినిమాల జోరు

    వరుస సినిమాల జోరు

    వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో బిజీ స్టార్ గా మారుతున్నాడు. అంతరిక్షం చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరికొన్ని వారాల వ్యవధిలోనే వరుణ్, వెంకీ నటించిన మల్టీస్టారర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం విడుదలయ్యాక బాబీ నిర్మాణంలోనే చిత్రం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.

    English summary
    Varun Tej new movie based on Boxing. Allu Bobby will producing this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X