స్పేస్ థ్రిల్లర్ మూవీ.. వరుణ్ తేజ్ మొదలు పెట్టేశాడు!
వరుస రెండు ఘనవిజయాల తరువాత వరుణ్ తేజ్ మరో ఆసక్తికరమైన చిత్రానికి రెడీ అయిపోయాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న స్పేస్ థ్రిల్లర్ చిత్ర షూటింగ్ నేను ప్రారంభమైంది. ఆసక్తికరమైన ప్రాజెక్ట్, చాలా ఉత్సాహంతో ఉన్నా అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశాడు.
ఫిదా, తొలి ప్రేమ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో వరుణ్ తేజ్ జోరుమీద ఉన్నాడు. రెండు రొమాంటిక్ చిత్రాల అనంతరం వరుణ్ తేజ్ స్పేస్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు. ఘాజి చిత్రంతో అందర్నీ ఆశ్ఛర్యంలో ముంచెత్తిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దీనితో ఇప్పటినుంచే ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువవుతున్నాయి.

సంకల్ప్ రెడ్డి చిత్రంలో నటిస్తూనే మరో చిత్రంతో కూడా వరుణ్ బిజీ కాబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మల్టీస్టారర్ చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ నుంచి పట్టాలెక్కబోతోంది. ఒకేసారి రెండు చిత్రాలతో వరుణ్ బిజీ హీరోగా మారిపోయాడు.


Click it and Unblock the Notifications











