‘ఎఫ్ 2’తో నవ్వించాడు... ఈ సారి ముఖం పచ్చడి చేయబోతున్న వరుణ్ తేజ్!
'ఎఫ్ 2' మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో వరుణ్ తేజ్ ఫుల్ జోష్ మీదున్నాడు. రోటీన్ సినిమాలకు భిన్నంగా విభిన్నమైన కథలు, విభిన్నమైన కన్సెప్టులు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న మెగా ప్రిన్స్ త్వరలో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అంతరిక్షం మూవీలో వ్యోమగామి పాత్రలో... ఎఫ్2లో తెలంగాణ అల్లుడిగా కామెడీ పాత్రలో కనిపించిన వరుణ్... తన తర్వాతి సినిమాకు స్పోర్ట్స్ డ్రామా కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేయబోతున్న ఈ మూవీలో వరుణ్ బాక్సర్‌గా కనిపించబోతున్నారు.

వరుణ్ కోచ్ పాత్రలో అర్జున్
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సార్జా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారట. ఇందులో ఆయన వరుణ్ కోచ్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

కిరణ్ కొర్రపాటి
కిరణ్ కొర్రపాటి గతంలో వరుణ్ తేజ్ నటించిన మిస్టర్, తొలి ప్రేమ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. వరుణ్ బాడీ లాంగ్వేజ్ దగ్గరుండి గమనించిన ఈ యంగ్ డైరెక్టర్ మెగా ప్రిన్స్‌కు పర్ఫెక్టుగా సూటయ్యే కథను సిద్ధం చేశాడట.

నిర్మించేది అల్లు అర్జున్ బ్రదర్
ఈ చిత్రానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, వరుణ్ కజిన్ అల్లు బాబీ నిర్మాతగా వ్యవరించబోతన్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

ఎఫ్ 2తో నవ్వించాడు, ఈ సారి ముఖం పచ్చడి చేయబోతున్నాడు
ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకులను తెగ నవ్వించిన వరుణ్ తేజ్.... తన తర్వాతి మూవీలో బాక్సింగ్ రింగులో ప్రత్యర్థుల ముఖాన్ని తన పిడి గుద్దులతో పచ్చడి చేయబోతున్నాడు. రోటీన్ సినిమాలకు భిన్నంగా వరుణ్ తేజ్ కథలు ఎంచుకుంటున్న విధానం అందరినీ ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











