వరుణ్ తేజ్ నెక్ట్స్ ఫిల్మ్: ఈ కాంబినేషన్ ఇంట్రెస్టింగ్‌గా ఉందే..
ఫిదా, తొలి ప్రేమ చిత్రాలతో వరుస విజయాలు అందుకుని స్టార్ హీరో రేంజికి ఎదుగుతున్న మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నెక్ట్స్ మూవీ ఖరారైంది. 'అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాగర్ చంద్ర దర్శకత్వంలో వరుణ్ తన తర్వాతి సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ ఎంటర్టెన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.
14 రీల్స్ ఎంటర్ టైన్‌మెంట్స్ అధినేతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా '14 రీల్స్ ప్లస్' అనే కొత్త బేనర్లో ప్రొడక్షన్ నెం. 1 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన వెలువడింది. పూర్తి వివరాలు చిత్రబృందం త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

'అప్పట్లో ఒకడుండేవాడు' మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన సాగర్ చంద్ర విమర్శల ప్రశంసలు అందుకున్నారు. ఈ యంగ్ డైరెక్టర్ తన తర్వాతి సినిమా మెగా ఫ్యామిలీ హీరోతో చేస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ కాంబినేషన్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











