»   » వరుణ్ తేజ్ ప్రభాస్ పైనే సెటైర్ వేశాడుగా..నితిన్ కు కూడా జర్క్..!

వరుణ్ తేజ్ ప్రభాస్ పైనే సెటైర్ వేశాడుగా..నితిన్ కు కూడా జర్క్..!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    తొలిప్రేమ సూపర్ సక్సెస్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సంతోషం మునిగి తేలుతున్నాడు. ఫిదా, తొలిప్రేమ వంటి బ్యాక్ టూ బ్యాక్ విజయాలు దక్కడంతో వరుణ్ తేజ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. తొలిప్రేమ చిత్రం వరుణ్ తేజ్ ని నటుడిగా అన్ని యాంగిల్స్ లో ఆవిష్కరించింది. ఈ మెగా హీరోపై ప్రశంసలు దక్కుతున్నాయి. వరుణ్ ప్రస్తుతం పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ పెళ్లి ప్రస్తావన రాగా ప్రభాస్, నితిన్ పై చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. దీనితో టాలీవుడ్ లో మరో మారు పెళ్లి కానీ ప్రసాద్ ల గురించి చర్చ మొదలైంది.

    Tholi Prema 1st Day Collections
    వరుణ్ తేజ్ పెళ్లి ప్రస్తావన

    వరుణ్ తేజ్ పెళ్లి ప్రస్తావన

    తొలిప్రేమ సక్సెస్ సాధించడంతో లీడ్ పెయిర్ వరుణ్, రాశి ఖన్నా పోస్ట్ రిలీజ్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా వరుణ్ ప్రేమ పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూ లో యాంకర్ ప్రస్తావన తీసుకుని వచ్చింది. తన పెళ్లి గురించి చెబుతూ వరుణ్ తనకన్నా సీనియర్ హీరోల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

    ప్రభాస్ పై సెటైర్

    ప్రభాస్ పై సెటైర్

    టాలీవుడ్ లోనే కాదు ఇండియాలో కూడా ప్రభాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. థర్టీ ప్లస్ లోకి అడుగుపెట్టినా ఈ బాహుబలి ఇంకా ఓ ఇంటివాడు కాలేదు. నీ పెళ్లెప్పుడని వరుణ్ ని ప్రశ్నించగా.. తనకన్నా సీనియర్లు పెళ్లి కావలసిన వారు చాలా మందే ఉన్నారు. ప్రభాస్ అన్నయ్యకు కూడా ఇంకా పెళ్లి కాలేదుగా అంటూ వరుణ్ సెటైర్ వేసాడు.

    నితిన్ కి కూడా జర్క్

    నితిన్ కి కూడా జర్క్

    తన సీనియర్ నితిన్ కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదని వాళ్ళందరి పెళ్లి అయ్యాక తన పెళ్లి గురించి ఆలోచిస్తానని వరుణ్ తెలపడం విశేషం.

    పెళ్లికాని ప్రసాదులు బోలెడంత మంది

    పెళ్లికాని ప్రసాదులు బోలెడంత మంది

    టాలీవుడ్ లో పెళ్లి కానీ ప్రసాదుల జాబితా తీస్తే చాంతాడంత అవుతుంది. థర్టీ ప్లస్ వచ్చినా పెళ్లి చేసుకోకుండా కెరీర్ లో బిజీగా గడుపుతున్న హీరోలు చాలా మందే ఉన్నారు.

    బాహుబలి బాటలోనే భల్లాలుడు

    బాహుబలి బాటలోనే భల్లాలుడు

    విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్న రానా దగ్గుబాటి కూడా టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులరే. 33 ఏళ్ల వయసున్న రానాకు ఇంకా పెళ్లి గడియలు దగ్గరపడలేదు.

    ఎనర్జిటిక్ హీరోది కూడా అదే పరిస్థితి

    ఎనర్జిటిక్ హీరోది కూడా అదే పరిస్థితి

    ఎనర్జిటిక్ హీరో రామ్ కూడా 30 కి రీచ్ అవుతున్నాడు. మనవాడు కూడా పెళ్లి గురించి పట్టించుకోకుండా కెరీర్ లో బిజీగా గడుపుతున్నాడు.

    మెగా మేనల్లుడికి కూడా ఆలోచన లేదా

    మెగా మేనల్లుడికి కూడా ఆలోచన లేదా

    మేనమామల పోలికలతో ఉన్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా కెరీర్ పరంగా రాణిస్తున్నాడు. తేజు కూడా ఇంత వరకు పెళ్లి ఊసే ఎత్తలేదు.

    అదే దారిలో నిఖిల్, శర్వా

    అదే దారిలో నిఖిల్, శర్వా

    నిఖిల్, శర్వానంద్ వంటి హీరోలు చాలా కాలంగా టాలీవుడ్ లో స్థిరపడ్డారు. థర్టీ ప్లస్ లో కూడా చార్మింగ్ లుక్ తో అదరగొట్టే ఈ హీరోలు పెళ్లి మాట ఎత్తకపోవడం విశేషం.

    English summary
    Varun Tej opens up about his marriage. Varun Tej interesting comments on Nithiin and Prabhas
    దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more