సినిమా కోసం ప్రాణం పెట్టేస్తున్న వరుణ్ తేజ్.. జీరో గ్రావిటీలో రిస్కీ సీన్స్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం సంచలన దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్పేస్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఘాజి చిత్రంతో అబ్బురపరిచిన సంకల్ప్ రెడ్డి, వరుణ్ తేజ్ సినిమాతో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రంలో అంతరిక్ష పరిశోధనలకు సంబందించిన సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ విదేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి తాజగా వస్తున్న వార్తలు ఆసక్తికరంగా ఉన్నాయి.
Recommended Video


అదితి రావుతో జంటగా
ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి నటిస్తోంది. మరో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.

జీరో గ్రావిటీతో భారీ సెట్
జీరో గ్రావిటీ ఉండేలా హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో ఈ చిత్రం కోసం భారీ సెట్ నిర్మించారు. ప్రస్తుతం ఈ సెట్ లో షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం కోసం కొన్ని నెలల పాటు వరుణ్ తేజ్ ప్రత్యేకంగా శిక్షణ పొందిన సంగతి తెలిసిందే.

ప్రాణం పెట్టి చేస్తున్న వరుణ్ తేజ్
ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ రిస్క్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రిస్కీ సన్నివేశాల్లో వరుణ్ డూప్ లేకుండా స్వయంగా నటిస్తున్నాడట. అన్ని జాగ్రత్తలని చిత్ర యూనిట్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

గ్రాఫిక్స్ కోసం
ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన పాత్ర పోషించనున్నాయి. షూటింగ్ తో పాటు చిత్ర యూనిట్ 3 డి స్కానింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రాఫిక్స్ సమయంలో 3 డి స్కానింగ్ ఉపయోగపడనుంది.


Click it and Unblock the Notifications











