బుల్లెట్ చూడాలనుకోవద్దు.. చచ్చి పోతారంటున్న మెగా హీరో!
టాలీవుడ్ తారలంతా మా అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ సెలెబ్రేషన్స్ కోసం డల్లాస్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. నిన్న మొన్నటివరకు మెగాస్టార్ చిరంజీవి మా సెలెబ్రేషన్స్ లో పాల్గొని వచ్చారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ తో పాటు ఇతర టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా హాజరయ్యారు.
వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, రెజీనా, అలీ, ప్రగ్య జైస్వాల్, అర్చన వంటి స్టార్ సెలబ్రటీలంతా ఈ ఈవెంట్ కు హాజరు కావడం విశేషం. అక్కడి ఎన్నారై అభిమానులతో మెగాస్టర్ చిరంజీవి పలు విషయాలు పంచుకునే సంగతి తెలిసిందే. కాగా డల్లాస్ లో సందడి చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మా అసోసియేషన్ సంబరాలు
మా అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ సంబరాలని డల్లాస్ లో ఘనంగా నిర్వహించింది. మెగా స్టార్ చిరంజీవితో పాటు పలువురు స్టార్స్ ఈ సంబరాలకు హాజరయ్యారు. చిరంజీవితో పాటు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ, అలీ వంటి నటులు కూడా హాజరు కావడం విశేషం.

మహేష్ బాబు డైలాగ్‌తో
వరుణ్ తేజ్ స్టేజిపై తెలుగు ఎన్నారై అభిమానులనిఅలరించాడు. సూపర్ స్టార్ మహేష్ అతడు చిత్రంలోని 'గన్ను చూడాలనుకోండి.. తప్పు లేదు.. కానీ బులెట్ చూడాలనుకోవద్దు.. చచ్చిపోతారు అనే డైలాగ్ చెప్పి అలరించాడు.

ప్రగ్యాతో సిటీమార్
మహేష్ డైలాగు చెప్పడమే కాదు.. అల్లు అర్జున్ సిటీమార్ సాంగ్ కు వరుణ్ స్టెప్పులేశాడు కూడా. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో కలసి వరుణ్ తేజ్ సిటిమార్ సాంగ్ కు స్టెప్పులేసి అభిమానులని అలరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మిడిఐలో మీడియాలో వైరల్ గా మారుతోంది.

మంచి పని కోసం
మా అసోసియేషన్ ఓ మంచి పని కోసం ఈ ఈవెంట్ ని డల్లాస్ లో నిర్వహించింది. వయో వృద్ధులైన తెలుగు నటులకు ఓల్డేజ్ హోమ్ నిధుల కోసం మా అసోసియేషన్ ఈ ఈవెంట్ ని డల్లాస్ లో నిర్వహించడం విశేషం.

జోరు మీదున్న వరుణ్
ఫిదా, తొలిప్రేమ వంటి విజయాలతో వరుణ్ తేజ్ కెరీర్ పరంగా మంచి జోరుమీద ఉన్నాడు. వరుణ్ తేజ్ ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో స్పేస్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ తో రూపొందించే మల్టీస్టారర్ చిత్రం కోసం కూడా రెడీ అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











