పూరీ సార్ ..ఏం స్పీడు : నెక్ట్స్ ప్రకటన ఇచ్చేసారు

By Srikanya

హైదరాబాద్ : నితిన్, పూరి జగన్నాథ్ ల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ... ప్రాజెక్టు కాన్సిల్ అయ్యిపోయింది. అంతే స్పీడుగా పూరి తన తదుపరి చిత్రాన్ని అదే తేదీన వరుణ్ తేజతో ప్రారంబిస్తానని జెట్ స్పీడుతో ప్రకటించేసాడు. ఈ మేరకు ప్రెస్ నోట్ పంపారు. ఆ ప్రెస్ నోట్ లో ఏమి ఉందంటే....

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మాతగా ఛార్మికౌర్ సమర్పణలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఛార్మి ప్రధాన పాత్రలో నిర్మించిన ‘జ్యోతిలక్ష్మీ' జూన్ 12న విడుదల కానుంది. కాగా...మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం గురించి సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేతన సి.కళ్యాణ్ మాట్లాడుతూ....‘‘చంద్రకళ నుంచి జ్యోతిలక్ష్మీ వరకు మా బేనర్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. తాజాగా మా బేనర్‌లో వరుణ్ తేజ్ హీరోగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. పూరిగారు ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన సబ్జెక్ట్‌ని చేశారు. ఈ చిత్రాన్ని జూన్ నెలలోనే ప్రారంభిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం'' అన్నారు.

Varun Tej replaces Nithin in Puri's film!

నితిన్-పూరి ట్వీట్ల యుద్దం

కొన్ని అనివార్య కారణాల వల్ల పూరి జగన్నాధ్ గారితో నేను చేయాల్సిన సినిమాను ఆపేస్తున్నాం. ప్యూచర్ లో ఆయనతో పనిచేస్తానని ఆశిస్తున్నాను అని నితిన్ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కాస్త ఘాటుగానే పూరి స్పందించారని ఆయన తాజా ట్వీట్ చూస్తే అర్దమవుతుంది.

పూరీ ట్వీట్ చేస్తూ..." నేను నితిన్ తో చేద్దామనుకున్న ప్రాజెక్టుని వేరే హీరోతో చేస్తున్నాను. అదే రోజున షూటింగ్ ప్రారంభమవుతుంది..మిగతా వివరాలు త్వరలో తెలియచేస్తాను " అన్నారు. అదే రోజున వేరే హీరోతో ఇదే కథతో ప్రాజెక్టు స్టార్ట్ చేస్తానని పూరి వెంటనే అనటం అంతటా చర్చనీయాంశంగా మారింది.

గతంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ గతంలో నితిన్ నాకు ఒక మంచి వ్యక్తిగా తెలుసు. ఎప్పటి నుంచి అయితే అతనితో పనిచేసానో అప్పటి నుంచి అతనితో ప్రేమలో పడిపోయాను. అతను ఎంతో కష్టపడి పనిచేస్తాడు, అలాగే అతని ఎనర్జీ లెవల్స్ బాగా హై రేంజ్ లో ఉంటాయి. ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలనుకుంటున్నాం అది ఇప్పటికి కుదిరింది.' అని అన్నాడు. మరి ఈ లోగా ఏం తేడాలో వచ్చాయో ఏంటో ఇలా కాన్సిల్ అయ్యింది ఈ ప్రాజెక్టు.

Varun Tej replaces Nithin in Puri's film!

ఇక పూరి రిలీజ్ కు రెడీగా ఉన్న జ్యోతి లక్ష్మి చిత్రం విషయానికి వస్తే...

పూరి దర్శకత్వం వహించిన చిత్రం 'జ్యోతిలక్ష్మీ'. ఛార్మి ప్రధాన పాత్రధారి. వరుణ్‌ తేజ్‌, సి.వి.రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'జ్యోతిలక్ష్మీ' తొలి గీతాన్ని విడుదల చేశారు. 'జ్యోతిలక్ష్మీ ఐయామ్‌ కాస్ట్‌లీ టు టచ్‌ మీ..' అంటూ సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్‌ రచించారు.

సునీల్‌ కశ్యప్‌ సంగీత సారథ్యంలో ఉమా నేహా గానం చేశారు. సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''జ్యోతిలక్ష్మీ స్వభావాన్ని వ్యక్తం చేసే గీతమిది. భాస్కరభట్ల చక్కగా రాశారు. ఈ నెల 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

పూరి మాట్లాడుతూ...జ్యోతిలక్ష్మీ అమ్మాయి కాదు. ఆటమ్‌బాంబు లెక్క! మాటలు సీమటపాకాయల్లా పేల్తూనే ఉంటాయి. ఇక పాటపాడితే.. మామూలుగా ఉంటుందా? అందుకే 'ఏయ్‌ రాసుకోరా సాంబ..' అంటూ తన గురించి తాను గొప్పగా ఆవిష్కరించుకొంది. ఆ సంగతేంటో తెలియాలంటే జ్యోతిలక్ష్మీ సినిమా చూడాల్సిందే అంటున్నారు .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X