నేను, తేజు సైకోలా ప్రవర్తించాం, కళ్యాణ్ బాబాయ్‌కి తెలిసింది.. ఒక రోజంతా.. వరుణ్ తేజ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన అంతరిక్షం ఇలా విడుదలయ్యిందో లేదో అప్పుడే ఎఫ్2 ప్రమోషన్స్ మొదలైపోయాయి. అనిల్ రావిపూడి దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్, వెంకటేష్ హీరోలుగా నటిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వరుణ్ తేజ్, వెంకటేష్ ఇటీవల రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నెం 1 యారీ షోకు అతిథులుగా హాజరయ్యారు. రానా అడిగిన ఓ ప్రశ్నకు వరుణ్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 పవన్ కళ్యాణ్ గారు నిన్ను కొట్టారా

పవన్ కళ్యాణ్ గారు నిన్ను కొట్టారా

పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఎప్పుడైనా కొట్టారా అని వరుణ్ తేజ్‌ని రానా ప్రశ్నించాడు. వరుణ్ మాట్లాడుతూ కొట్టలేదు కానీ బాగా తిట్టారు అంటూ జరిగిన విషయాన్ని వివరించాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ సంఘటన జరిగిందని వరుణ్ తెలిపాడు. ఆ రోజు నా పుట్టినరోజు సందర్భంగా రాత్రి చిన్న పార్టీ ఏర్పాటు చేసుకున్నాము. నేను, సాయిధరమ్ తేజ్ మరికొంతమంది స్నేహితులు ఈ పార్టీలో పాల్గొన్నారు.

సైకోలా ప్రవర్తించాం

సైకోలా ప్రవర్తించాం

ఎవరి పుట్టిన రోజు అయినా మా స్నేహితులంతా నానా హంగామా చేస్తారు. ఆ రోజు హంగామా ఇంకాస్త ఎక్కువగా జరిగింది. మా ఇంటి బయటే ఈ పార్టీ జరిగింది. పిల్లలు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు కదా అని నాన్న లోపలే ఉండిపోయారు. ఎవరి బర్త్ డే అయితే వాడికి ఆరోజు మూడిందే. కోడి గుడ్లు, బెల్టులతో నేను, తేజు ఆరోజు హద్దులు దాటి కాస్త సైకోలా ప్రవర్తించాం. మా సెలెబ్రేషన్స్ లో భాగంగానే ఇదంతా జరిగింది. పెద్ద పెద్దగా శబ్దాలు వస్తుంటే నాన్న కిటికీలో నుంచి చూసేశారు. వెంటనే కళ్యాణ్ బాబాయ్ కి ఫోన్ చేసే చెప్పేశారు.

రోజంతా క్లాస్

రోజంతా క్లాస్

కళ్యాణ్ బాబాయ్ మరుసటి రోజే మమ్మల్ని పిలిచి రోజంతా తిట్టారు. బాగా క్లాస్ పీకారు అని వరుణ్ తెలిపారు. ఇక నుంచి చిన్న పిల్లల చేష్టలు ఇక మానేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నా. బాబాయ్ తిట్టిన రోజే నా కళ్ళు తెరుచుకున్నాయి అని వరుణ్ తేజ్ తెలిపాడు. ఈ సంఘటన విని ఒకరోజంతా తిట్టారా అని రానా ఆశ్చర్యపోయాడు. పక్కనే ఉన్న వెంకీ నవ్వుతూ కనిపించారు.

కామెడీ ఎంటర్‌టైనర్

కామెడీ ఎంటర్‌టైనర్

ఇదిలా ఉండగా అంతరిక్షం లాంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించిన వరుణ్ తేజ్ వరుణ్ తేజ్ ఎఫ్2 రూపంలో కామెడీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వరుణ్ తేజ్, వెంకీ ఈ చిత్రంలో తోడల్లుళ్లుగా నటిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X