‘అంతరిక్షం’లో అసలు విషయం మిస్సయింది... ఆడుతుందా?
వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'అంతరిక్షం 9000'. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై క్రిష్ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించారు. డిసెంబర్ 21న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఓ ఆసక్తికర వీడియో విడుదల చేశారు. 'ఇండియన్ మాస్ కౌన్సిల్' ప్రతినిధి ఈ సినిమా గురించి వరుణ్ తేజ్‌ను ప్రశ్నించినట్లు అందులో చూపించారు.

ఇండియన్ మాస్ కౌన్సిల్ అంటే ఏమిటి?
ఇండియన్ మాస్ కౌన్సిల్... అంటే ఏమిటి? ఇదొకటి ఉన్నట్లు ఎప్పుడూ వినలేదే? అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నది నిజమే. అయితే సినిమాను ప్రమోట్ చేయడానికి చిత్ర బృందమే దీన్ని క్రియేట్ చేసింది. ‘సినిమాలోని మాస్ ఎలిమెంట్స్‌ను బేస్ చేసుకుని సినిమాకు రేటింగ్ ఇచ్చే ఫిక్షనల్ సెన్సార్ బోర్డ్' అంటూ ఓ డెఫినిషన్ కూడా ఇచ్చేసింది.

చిరు మాస్ డైలాగ్స్ వింటూ...
ఇండియన్ మాస్ కౌన్సిల్ ప్రతినిధి వరుణ్ తేజ్‌ను కలిసేందుకు వచ్చినపుడు... అందరివాడు చిత్రంలో చిరంజీవి డైలాగ్స్ వింటూ కనిపించారు వరుణ్. ‘మాస్ ఇమేజే మనల్ని ఈ రేంజిలో నిలబెట్టింది' అంటూ అందులో చిరు డైలాగ్స్ చెప్పడం చూడొచ్చు.

మీ ఫ్యామిలీ రికమండేషన్ ఉందని ఈ సర్టిఫికెట్ ఇవ్వం
ఇది చాలా ఇంపార్టెంట్ సర్టిఫికెట్..నువ్వు మర్యాదలు ఇస్తావనో? నీ ఫ్యామిలీ రికమండేషన్ ఉందనో? నీకు ఈ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదు. పారామీటర్స్ అన్నీ రీచ్ అయితేనే నీకు మాస్ సర్టిపికెట్ ఇవ్వడం జరుగుతుంది...అంటూ మాస్ కౌన్సిల్ ప్రతినిధి వరుణ్ తేజ్‌తో చెప్పడం గమనార్హం.

ఎలివేషన్, మాస్ ఎలిమెంట్స్
ఈ సినిమాలో హీరోకు ఆకాశం అంత ఎలివేషన్ ఉండాలి ఉందా? అని ప్రశ్నించగా.... అంతరిక్షం పోస్టర్లో తాను స్పేస్ లో ఎగురుతున్న ఫోటో చూసిన వరుణ్ తేజ్ అంతకు మించి ఉంటుందని సమాధానం ఇస్తాడు. మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయా? అని ప్రశ్నించగా... డౌట్ వచ్చిన వరుణ్ తేజ దర్శకుడికి ఫోన్ చేయగా సైన్సుకు సంబంధించిన మాస్ ఈక్వెస్ చెప్పడం గమనార్హం.
ఐటం సాంగ్ ఉందా?
ఐటం సాంగ్ ఉందా? అని అడగటంతో వరుణ్ తేజ్ లేదు అని సమాధానం చెబుతాడు. దానికి మాస్ కౌన్సిల్ ప్రతినిధి మీ సినిమా దొబ్బినట్లే అనే ఎక్స్‌ప్రెషన్ పెడతాడు. దానికి వరుణ్ తేజ్ ఏ సమాధానం చెప్పారో వీడియోలో మీరే చూడండి.


Click it and Unblock the Notifications











