చిరంజీవి గారు ఎప్పుడూ చెబుతుండేవారు.. ఆ కిక్కే వేరు.. ఇప్పుడు తెలిసింది: వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా 'వాల్మీకి'. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ' సినిమాకి రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రంలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 20వ తేదీన వాల్మీకి విడుదల కానున్న నేపథ్యంలో నిన్న (ఆదివారం) చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఆ వివరాలు చూద్దామా..

విక్టరీ వెంకటేష్ అతిథిగా

విక్టరీ వెంకటేష్ అతిథిగా

హైదరాబాద్‌ శిల్పకళావేదికలో ఆదివారం సాయంత్రం వాల్మీకి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విక్టరీ వెంకటేష్‌ హాజరై సందడి చేశారు. కార్యక్రమానికి హోస్ట్‌గా సుమ అదరగొట్టేసింది. ఈ సందర్బంగా వాల్మీకి ఆడియో సీడీని వెంకటేష్ ఆవిష్కరించారు.

Recommended Video

Varun Tej Speech At Valmiki Press Meet
మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ స్పీచ్.. హోరెత్తిన వేదిక

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ స్పీచ్.. హోరెత్తిన వేదిక

అనంతరం మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ మాట్లాడుతుండగా వేదికా ప్రాగణం మొత్తం ఈలలతో హోరెత్తిపోయింది. వరుణ్ స్పీచ్ వింటూ ఫుల్ ఖుషీ అయ్యారు మెగా అభిమానులు. ఆయన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లను ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడిన తీరు బాగా ఆకట్టుకుంది. వాల్మీకి యూనిట్ పై ఆయన చూపిన ప్రేమ మెగా అభిమానుల్లో ఉత్సాహం నింపాయి.

 విక్టరీ వెంకటేష్‌‌కి స్పెషల్ థాంక్స్ చెబుతూ

విక్టరీ వెంకటేష్‌‌కి స్పెషల్ థాంక్స్ చెబుతూ

విక్టరీ వెంకటేష్‌‌కి స్పెషల్ థాంక్స్ చెబుతూ తన ప్రసంగం మొదలు పెట్టాడు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌. 'వాల్మీకి' తన తొమ్మిదో సినిమా అని, ఇదే తన ఫస్ట్‌ మాస్‌ సినిమా అని ఆయన పేర్కొన్నాడు. ఫస్ట్‌ టైమ్‌ ఒక మాస్‌ సినిమా చేస్తే ఆ కిక్కే వేరని అన్నాడు వరుణ్. చిరంజీవి గారు ఎప్పుడూ చెబుతుండేవారు.. మేము మాస్‌ సినిమాలు ఎందుకు చేస్తామో నీకు అర్ధం కావడం లేదు అని, మాస్‌లో ఒక పవర్‌ ఉంటుంది అని. అలా ఎందుకు చెప్పేవారో ఇప్పుడు అర్థమైందని వరుణ్ అన్నాడు.

ఆయనతో పని చేయడం నా అదృష్టం

ఆయనతో పని చేయడం నా అదృష్టం

గబ్బర్ సింగ్ రూపంలో మా బాబాయ్‌ (పవన్ కళ్యాణ్)కి అంత పెద్ద హిట్‌ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్.. నాతో చేయడం నిజంగా తన అదృష్టమని వరుణ్ చెప్పాడు. సెట్లో హరీష్ సూపర్‌ ఎనర్జీతో ఉంటారని పేర్కొన్నాడు. ఆయన సపోర్ట్‌, గైడెన్స్‌ వల్లే ఈ క్యారెక్టర్‌ ఇంత మంచిగా చేయగలిగానని వరుణ్ తెలిపాడు. మా ప్రొడ్యూసర్స్‌ రామ్‌ ఆచంట, గోపి ఆచంట ఫుల్‌ సపోర్ట్‌ చేశారని చెప్పాడు.

'ఎల్లువొచ్చి గోదారమ్మ' ఎంతో స్పెషల్

'ఎల్లువొచ్చి గోదారమ్మ' ఎంతో స్పెషల్

ఈ సినిమాలో స్పెషల్‌గా 'ఎల్లువొచ్చి గోదారమ్మ' సాంగ్‌ రీమిక్స్‌ చేశాం. చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో మిక్కీ ఫస్ట్‌ టైమ్‌ మాస్‌ అదరగొట్టాడు. అలాగే ఈ సినిమాలో నటించిన ఆర్టిస్ట్‌లకు, సాంకేతిక నిపుణులకు థాంక్స్‌. ముఖ్యంగా మీ ఫ్యాన్స్‌ అందర్నీ చూస్తుంటే మా కుటుంబం ఇక్కడే ఉన్నట్లు ఉంటుంది అని అన్నాడు వరుణ్.

ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్

ట్రైలర్ చూసిన పవన్ కళ్యాణ్

రామ్ చరణ్, చిరంజీవి 'సైరా నరసింహా రెడ్డి' పనుల్లో బిజీగా ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదం నాపై ఎప్పటికీ ఉంటుంది. ఇక బాబాయ్ (పవన్ కళ్యాణ్) ఈ సినిమా ట్రైలర్ చూసి హరీష్ గారితో, నాతో మాట్లాడారు. చాలా బాగుంది, తెలంగాణా బాగా మాట్లాడావని ఆయన చెప్పినట్లుగా వరుణ్ తెలిపాడు.

గడ్డలకొండ గణేష్ అంటే గత్తర లేవాలా!

గడ్డలకొండ గణేష్ అంటే గత్తర లేవాలా!

మా ఫ్యామిలీని ఇన్ని సంవత్సరాలుగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థాంక్స్. గడ్డలకొండ గణేష్ అంటే గత్తర లేవాలా. 20వ తేదీ వాల్మీకి స్టార్ట్ అయి అక్టోబర్ 2న సైరా వస్తోంది. వాల్మీకిని ఎంత సక్సెస్ చేస్తారో దానికి రెట్టింపు సక్సెస్ సైరాను చేయాలని కోరుకుంటున్నా. ''జై హింద్'' అంటూ జోష్ నింపాడు వరుణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X