'గొల్లభామ' వరుణ్ తేజ పాత్ర ఇదే

లియో ప్రొడక్షన్స్ పతాకంపై సినిమా రూపొందబోతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం అందిస్తున్న దీనికి ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మాతలు. గోదావరి అందాల నడుమ సాగే చక్కటి ప్రేమకథగా సినిమా ఉండబోతోందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. 'కొత్తబంగారులోకం',' సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో తనదైన ముద్ర తెలుగు తెరపై వేసి ఆకట్టుకొన్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇప్పుడు వరుణ్‌తేజ్‌తో తొలి అడుగులు వేయించేందుకు సిద్ధమవుతున్నాడు.
చిరంజీవి మాట్లాడుతూ... నాగబాబు కొడుకంటే నా కొడుకు అన్నట్లే అని, వరుణ్ తేజను అభిమానులు ఆశీర్వదించాలని చిరంజీవి కోరారు.నాగబాబు కొడుకు వరుణ్ తేజను ప్రమోట్ చేయడానికి మెగా హీరోలంతా కలిసి పని చేయనున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితరులు సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు స్వయాన సోదరుడైన నాగబాబు....తన కొడుకు ఎంట్రీ కోసం పర్ ఫెక్టుగా ప్లానింగ్ చేసారు. గతంలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఎంట్రీ సందర్భంగా ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్న అనుభవం నాగబాబుకు ఉంది.
2008లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు. నాగబాబు కొడుకుకి సైతం గోదావరి బ్యాక్ డ్రాప్ ఆ తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు.
ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన క్వాలిటీస్‌ను మరింత మెరుగు పరుచుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా డాన్స్‌ల విషయంలో చాలా కష్టడుతున్నాడని వినికిడి. మెగాస్టార్ చిరంజీవి తనతైన డాన్స్ స్టెప్పులతో థియేటర్లను షేక్ చేసాడు. ఆ తర్వాత ఆయన వారసత్వంతో అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ డాన్స్‌ల విషయంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా స్టైల్ విషయంలో, డాన్స్ విషయంలో ప్రత్యేకత చాటుకోవడానికి ట్రై చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











