మెగా పోలికలున్నాయా? (వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్, ట్రైలర్)
హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో వచ్చాడు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమైంది. మెగా రేంజికి తగిన విధంగా గ్రాండ్‌గా ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది.
సినిమా ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వరుణ్ తేజ్‌పై ప్రత్యేకంగా ఫోటో షూట్ నిర్వహించి ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేసారు. అదే విధంగా వీడియో ట్రైలర్ రూపొందించారు. వరుణ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమాతోనే అతన్ని సక్సెస్ ట్రాక్ ఎక్కించేందుకు మెగాబ్రదర్ నాగబాబు మెగాప్లాన్స్‌తో ముందుకు సాగుతున్నారు.
వరుణ్ తేజ్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలు, ట్రైలర్లు స్లైడ్ షోలో.....

వరుణ్ తేజ్
వరుణ్ తేజ్....మెగా బ్రదర్ నాగబాబు-పద్మజ దంపతుల కుమారుడు. చూడచక్కని రూపం. పర్ పెక్టు హైటు, వెయిటు. తెలుగు సినిమా హీరోకు ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి.

సినిమా వాతావరణం ఎఫెక్ట్?
పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా రంగంలో పెద్ద స్టార్స్. తండ్రి నాగబాబు స్వయంగా నటుడు, నిర్మాత. ఇలా చిన్నతనం నుండి సినిమా వాతావరణంలో పెరిగాడు వరుణ్.

సినిమా హీరో అవ్వాలనే కల
ఇంట్లో ఉన్నవారంతా స్టార్సే. మరేరంగంలోకి వెళ్లినా...ఇంత పలుకుబడి, డబ్బు, పేరు, సెబ్రిటీ హోదా రాదు. ఈ నేపథ్యంలో ఆటోమేటింగ్‌గా వరుణ్ తేజ్ చిన్న తనం నుండి హీరో అవ్వాలని కలలు కన్నాడు.

తండ్రి ప్రోత్సాహం...
సినిమా హీరో అవ్వాలనే వరుణ్ తేజ్ కోరికను చిన్నతనం నుండి ప్రోత్సహిస్తూ వచ్చాడు వరుణ్ తండ్రి నాగ బాబు. పర్ ఫెక్టు ప్లానింగుతో పర్ ఫెక్టు టైమింగులో అతన్ని సినిమా రంగానికి పరిచయం చేస్తున్నాడు.

గతంలో ప్రయత్నాలు
2008లోనే రవిబాబు ‘నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు.

2009లో కూడా ప్రయత్నాలు
2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు.

అన్నీ సర్దుకున్నాయి
ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు. చాలా కాలం పాటు వరుణ్ తేజ్ ఎంట్రీకి సరిపోయే కథ కోసం అన్వేషించారు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో
గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', ‘కొత్త బంగారు లోకం' లాంటి చిత్రాలను తెరకెక్కించిన అనుభవం ఉన్న శ్రీకాంత్ అడ్డాల వరుణ్ తేజ్ మొదటి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లియో ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











