Ghani Movie OTT: నెల కూడా కాకముందే ఓటీటీలోకి గని.. ఎందులో రాబోతుందంటే!

పేరుకు మెగా హీరోనే అయినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకుని టాలీవుడ్‌లో స్టార్‌గా వెలుగొందుతోన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. 'ముకుంద' అనే సినిమాతో మొదలైన అతడి సినీ ప్రయాణం.. సవ్యంగానే సాగిపోతోంది. దీనికి కారణం ఈ యంగ్ హీరో కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తుండడమే. అందుకే ఈ మధ్య కాలంలో వరుణ్ వరుసగా హిట్లు మీద హిట్లు కొట్టాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'గని' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీకి అనుకున్న రీతిలో స్పందన రావడం లేదు. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ 'గని' చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌ గురించి ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

‘గని’గా మారిపోయిన మెగా హీరో

‘గని’గా మారిపోయిన మెగా హీరో

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రమే 'గని'. కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించారు. ఇక, ఈ సినిమాలో సయూ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా.. నవీన్ చంద్ర విలన్‌గా చేశాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. నదియా, ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రలు చేశారు.

అంచనాలు పెంచేసిన అప్‌డేట్లు

అంచనాలు పెంచేసిన అప్‌డేట్లు

ఫుల్ లెంగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన 'గని' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు తగ్గట్లే దీని నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు రికార్డు వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

బిజినెస్ భారీగా.. గ్రాండ్‌గా రిలీజ్

బిజినెస్ భారీగా.. గ్రాండ్‌గా రిలీజ్

తెలుగు రాష్ట్రాల్లో వరుణ్ తేజ్‌కు పెద్దగా మార్కెట్ లేదు. కానీ, ఈ మధ్య ఫుల్ ఫామ్‌లో ఉండడంతో 'గని' మూవీ హక్కులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 25.30 కోట్లు బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అన్ని ఏరియాల్లో కలిపి ఈ మూవీని చాలా థియేటర్లలో విడుదల చేశారు.

వరుణ్ సినిమాకు అలాంటి టాక్

వరుణ్ సినిమాకు అలాంటి టాక్

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'గని' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇందులో వరుణ్ తేజ్ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్‌, థమన్ సంగీతం మినహా పెద్దగా చెప్పుకోదగిన అంశాలేవీ లేవని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మరీ ముఖ్యంగా దర్శకత్వం లోపం కారణంగా ఈ సినిమా రొటీన్ స్పోర్ట్స్ డ్రామాగా మిగిలిపోయిందని రివ్యూలు వచ్చాయి.

కలెక్షన్లు తక్కువగా... పెద్ద దెబ్బ

కలెక్షన్లు తక్కువగా... పెద్ద దెబ్బ


వరుణ్ తేజ్ నటించిన 'గని' సినిమాకు టాక్‌కు అనుగుణంగానే కలెక్షన్లు కూడా చాలా తక్కువగా వస్తున్నాయి. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 2 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టిన ఈ సినిమా.. రెండు, మూడు రోజుల్లో కోటి రూపాయలు కూడా వసూలు చేయలేకపోయింది. దీంతో మొదటి వీకెండ్ సోసోగానే గడిచింది. వరుణ్ తేజ్ రేంజ్‌కు ఈ వసూళ్లు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు.

‘గని’ ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్లారిటీ

‘గని’ ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్లారిటీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - సయూ మంజ్రేకర్ జంటగా నటించిన 'గని' మూవీ ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అంటే విడుదలై మూడు రోజులు మాత్రమే అయ్యాయి. అయినప్పటికీ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందని సదరు సంస్థ ప్రకటించింది.

అప్పటి నుంచే సినిమా స్ట్రీమింగ్

అప్పటి నుంచే సినిమా స్ట్రీమింగ్

క్రేజీ కాంబోలో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'గని' మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఆహా సంస్థ.. దీన్ని ఏప్రిల్ 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతుందట. దీనికి సంబంధించిన ప్రకటన మరికొన్ని రోజుల్లోనే రాబోతుందని తెలుస్తోంది. ఇదే నిజం అయితే విడుదలై నెల రోజులు కూడా కాకముందే డిజిటల్ స్ట్రీమింగ్ జరుపుకోబోయే సినిమాగా ఇది నిలవనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X