మేము చాలా కష్టపడ్డాం.. బిజినెస్ పై దెబ్బ పడడం ఇష్టం లేదు.. గని యూనిట్ సంచలన ప్రకటన!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమా మరోసారి వాయిదా పడింది. కొద్దిసేపటి క్రితమే ఈ మేరకు ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే

ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది
కరోనా సెకండ్ వేవ్ తర్వాత చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. బాలకృష్ణ అఖండ దెబ్బకు థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఇప్పట్లో హౌస్ ఫుల్ బోర్డులు చూడలేము అనుకున్న ఈ పరిస్థితుల్లో కూడా అఖండ తెలుగు ప్రేక్షకులందరినీ ధియేటర్లకు రప్పించింది.. ఎనిమిది రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించిన అఖండ సినిమా ఇచ్చిన ధైర్యంతో మిగతా సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఆ రెండు సినిమాలు
ఇప్పటికే ప్రకటించిన దాని ప్రకారం అఖండ సినిమా తర్వాత డిసెంబర్ 17వ తేదీన అల్లు అర్జున్ పుష్ప ఫస్ట్ పార్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే డిసెంబర్ 24వ తేదీన నాని హీరోగా శ్యామ్ సింగరాయ్ అలాగే వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే తాజాగా ఈ రేసులో నుంచి తప్పుకుంటున్నట్లు గని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

బాక్సింగ్ నేపథ్యంలో
మెగా హీరో వరుణ్ తేజ్ గని అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు.. ఇక ఈ సినిమాతో అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబి నిర్మాతగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో బాక్సర్ పాత్రను పోషిస్తున్న వరుణ్ ప్రో అథ్లెట్ లాగా కనిపిస్తున్నాడు. ఇక అలా కనిపించడానికి తీవ్రంగా శిక్షణ పొందారు.

మేము చాలా కష్టపడ్డాం
''గని మాకు చాలా దగ్గరైన సినిమా.. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం.. డబ్బుకు వెనుకాడకుండా భారీ సెట్స్ ని , అరుదైన ప్రదేశాలు ఎంచుకున్నాము.. ప్రేక్షకులను ఒక మంచి విజువల్ ఫీల్ వచ్చేలా సినిమాను ప్లాన్ చేశాం.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమ రికవర్ అవుతుంది'' అని పేర్కొన్నారు.

బిజినెస్ పై దెబ్బ
ఈ నేపథ్యంలోనే చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో మా సినిమాను విడుదల చేయడం కష్టంగా ఉంది.. వాటితో క్లాషెస్ లేకుండా మరో రిలీజ్ తేదీని చూడాలనుకుంటున్నాము . ఎందుకంటే ఈ క్లాషెస్ వల్ల మేకర్స్ బిజినెస్ పై దెబ్బ పడుతోంది. గని ఖచ్చితంగా థియేటర్ లో రిలీజ్ అవుతుంది. కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటిస్తాము" అంటూ చెప్పుకొచ్చారు.

టాలీవుడ్‌లో డెబ్యూ
కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ 'గని' సినిమాతో సాయి మంజ్రేకర్ టాలీవుడ్‌లో డెబ్యూ ఇస్తోంది. జగపతి బాబు, నవీన్ చంద్ర, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా లాంటి వారు నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. నిజానికి ఈ సినిమాని అల్లు బాబి ఒక్కరే నిర్మించడం లేదు. ఆయన తన స్నేహితుడు సిద్ధూతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











