‘ముకుందా’: ఎక్సపెక్టేషన్స్ పెంచేస్తున్నాడు(కొత్త ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్ : మూడు రోజుల క్రిందటే మెగా ఫ్యామిలీ నుంచి ఓ కుర్రాడు (సాయి ధరమ్ తేజ)వెండి తెరపైకి పిల్లా నువ్వు లేని జీవితం అంటూ దూసుకువచ్చాడు. ఇప్పుడు ఇంకో కుర్రాడు సిద్దపడుతున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి హీరో నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న వరుణ్ తేజ్ మొదటి సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం ఫొటోలు కొత్తవి విడుదల చేసి సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.

వివరాల్లోకి వెళితే...మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మొదటి సినిమా ‘ముకుందా'. షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వరుణ్‌తేజ్ ప్రస్తుతం డబ్బింగ్ చెబుతున్నాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.

ముకుందా ..ఆడియోకు తేదీని డిసెంబర్ 6 న ఖరారు చేసినట్లు సమాచారం. ఆ రోజే టీజర్ విడుదల చేసి, మిగతా వ్యవహారాలు ఫినిష్ చేసి పబ్లిసిటీ పెంచనున్నారు. విడుదలతేదీ కూడా అదే రోజు ఇస్తారని తెలుస్తోంది.

స్లైడ్ షోలో కొత్త ఫోటోలు చూడండి..

తెలుగుతనం ఉట్టిపడేలా...

తెలుగుతనం ఉట్టిపడేలా...

గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెలుగు కుటుంబ అనుబంధాల నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు.

డబ్బింగ్ మొదలైంది.

డబ్బింగ్ మొదలైంది.

పాటలు తప్ప ఈ చిత్రం షూటింగ్ పూర్తైపోయింది. వరుణ్ తేజ ఇప్పటికే డబ్బింగ్ ప్రారంభించేసాడు. సినిమా చాలా బాగా వచ్చిందని, ఖచ్చితంగా ఓ లాండ్ మార్క్ సినిమాగా మిగులుతుందని చెప్తున్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అలాగే మెగాభిమానులు సైతం తమ క్యాంప్ నుంచి వస్తున్న కొత్త హీరో కోసం వెయిట్ చేస్తున్నారు.

మంచి స్పందన

మంచి స్పందన

ఇటీవలే విడుదల చేసిన వరుణ్‌తేజ్ ఫస్ట్‌లుక్ మరియు ఫస్ట్‌లుక్ టీజర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం కావటంతో మంచి క్రేజ్ వచ్చింది.

సమర్పకుడు ఠాగూర్‌ మధు మాట్లాడుతూ....

సమర్పకుడు ఠాగూర్‌ మధు మాట్లాడుతూ....

‘‘గోదావరి జిల్లాల్లోని అందమైన లొకేషన్లలో 35రోజులు భారీ షెడ్యూల్‌ చేశాం. సినిమా బాగా వచ్చింది '' అని అన్నారు.

ఎవరెవరు...

ఎవరెవరు...

లియో ప్రొడక్షన్స్‌ తెరకెక్కిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. మిక్కీ.జె.మేయర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, రావు రమేష్‌, నాజర్‌ ఇందులో కీలక పాత్రధారులు.

ఆదిత్యా వారు...

ఆదిత్యా వారు...

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X