వరుణ్ తేజ్ ‘ముకుంద’ రిలీజ్ ఎప్పుడు?

By Bojja Kumar

హైదరాబాద్: నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ త్వరలో ‘ముకుంద' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీనే ఈ చిత్రం ఆడియో వేడుక జరుగాల్సి ఉండగా...చిరంజీవి అందుబాటులో లేక పోవడంతో వాయిదా వేసారు. చిరంజీవి ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు ఆడియో వేడుక జరుగనుంది.

వరుణ్ తేజ్ తొలి సినిమా కాబట్టి...తమ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన చిరంజీవి చేతుల మీదుగా ఆడియో వేడుక ప్లాన్ చేస్తున్నారు నాగబాబు. ఈ చిత్రం ప్రారంభోత్సవం కూడా చిరంజీవి చేతుల మీదుగా జరిగిన సంగతి తెలిసిందే. ముకుంద చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. లియో ఎంటర్టెన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Varun Tej's Mukunda to release on December 25th ?

వరుణ్ తేజ్ ఈచిత్రంలో లవర్ బాయ్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తోంది. సాధారణంగా తొలి సినిమా అనగానే పెర్ఫార్మెన్స్ పరంగా కాస్త పూర్‌గా ఉంటారు. అయితే వరుణ్ తేజ్ మాత్రం యాక్టింగ్, డాన్స్ తదితర అంశాల్లో చాలా మెచ్యూరిటీ చూపిస్తున్నాడట. పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్నవాడిలా వీలైనంత వరకు ఎక్కువగా టేకులు తీసుకోకుండా పర్‌ఫెక్టుగా చేస్తున్నాడట.

ఈ చిత్రంలో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్ గా కనిపించనున్నాడని సమాచారం. బ్రహ్మానందం,ప్రకాష్ రాజ్, నాజర్, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్‌ మధు, నల్లమలుపు బుజ్జి నిర్మాతలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X