twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కడ కూడా రికార్డులు బద్దలు కొడుతున్న వరుణ్ తేజ్ సినిమా

    |

    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. అతడు చేసిన రెండు మూడు చిత్రాలు మినహా మిగిలినవన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కథల ఎంపికలో వైవిధ్యం చూపడంతో పాటు ప్రయోగాలకూ వెనుకాడకపోవడంతో వరుణ్ తేజ్ కెరీర్ సాఫీగా సాగుతోంది. అందుకే అతడి మార్కెట్ కూడా సినిమా సినిమాకూ పెరిగిపోతోంది. దీంతో ఈ మెగా హీరో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నాడు. ముఖ్యంగా 'ఫిదా' వంటి హిట్ సినిమా తర్వాత వరుణ్ కెరీర్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.

    ఆ తర్వాత కూడా మంచి సినిమాలే చేశాడు. వీటిలో యూత్ ఫుల్ లవ్ స్టోరీ 'తొలిప్రేమ' ఒకటి. తన బాబాయి పవన్ కల్యాణ్ కెరీర్‌లో సూపర్ హిట్ చిత్రమైన సినిమాల్లో 'తొలిప్రేమ' ఒకటి. అదే టైటిల్‌తో వరుణ్ నటించిన ఈ సినిమా కూడా భారీ విజయాన్నే అందుకుంది. వెంకీ అట్లూరీ తెరకెక్కించిన ఈ సినిమాలో వరుణ్ సరసన రాశీ ఖన్నా నటించింది. ఈ సినిమాను బీవీఎస్ ప్రసాద్ నిర్మించగా, తమన్ సంగీతం అందించాడు. తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'తొలిప్రేమ'ను హిందీలో డబ్బింగ్ చేశారు.

    Varun Tejs Tholi Prema creates record in Youtube

    రెండు రోజుల క్రితం ఈ సినిమాను అదే టైటిల్‌తో యూట్యూబ్‌లో ఉంచారు. అలా పెట్టారో లేదో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. కేవలం 24 గంటల్లోనే ఒక మిలియన్ వ్యూస్ సాధించిందీ సినిమా. అంతేకాదు, రెండు లక్షల పైచిలుకు లైకులను కూడా అందుకుంది. దీంతో ఒక రోజులోనే ఈ తరహా స్పందన వచ్చిన చిత్రంగా 'తొలిప్రేమ' రికార్డులకెక్కింది. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు మెగా అభిమానులు ఖుషీగా ఉన్నారు. గతంలో మెగా హీరోల సినిమాలు కూడా ఇదే స్థాయిలో వ్యూస్ సాధించాయి.

    English summary
    Tholi Prema is a 2018 Indian Telugu language coming of age romantic comedy film. It is directed by debutant Venky Atluri and is produced by B. V. S. N. Prasad under his banner Sri Venkateswara Cine Chitra. It features Varun Tej and Raashi Khanna in the lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X