twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్ టాక్ అదిరింది.. వరుణ్, తేజు యుద్ధం ఖాయం..!

    |

    ఇద్దరు మెగా హీరోల చిత్రాలు కేవలం ఒక్క రోజు గ్యాప్ లో విడుదలవుతుండడం బహుశా మెగా ఫ్యామిలీ హిస్టరీలో ఇదే తొలిసారి కావచ్చు. వాస్తవానికి ఒకేరోజు విడుదల కావాల్సింది. కానీ వరుణ్ తేజ్ తన తొలిప్రేమ చిత్రాన్ని ఒక రోజు వాయిదా వేసుకున్నాడు. దీనితో సాయిధరమ్ తేజ్ ఇంటెలిజెంట్ చిత్రం ఫిబ్రవరి 9 న విడుదలవుతుండగా, వరుణ్ తొలిప్రేమ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రెండు చిత్రాలు సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకున్నాయి.

    Recommended Video

    Mega Hero's clashes, Allu Arjun takes lead
    ఇంటెలిజెట్ సెన్సార్ టాక్

    ఇంటెలిజెట్ సెన్సార్ టాక్

    మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాగా యాక్షన్, రొమాన్స్ ప్రధానాంశాలుగా రాబోతున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రలో తప్పకుండా మెప్పిస్తాయని సెన్సార్ టాక్ బయటకు వచ్చింది.

     తొలిప్రేమ సెన్సార్ టాక్

    తొలిప్రేమ సెన్సార్ టాక్

    వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎక్కువగా రొమాంటిక్ లవ్ స్టోరీలపై దృష్టి పెట్టాడు. తొలిప్రేమ కూడా ఆ కోవలోకి చెందినదే తొలిప్రేమ కూడా. ఈ చిత్రానికి కూడా సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ ని జారీ చేశారు. రొమాంటిక్ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే వరుణ్, రాశి ఖన్నామధ్య రొమాన్స్ ఏ రేంజ్ లో పండిందో అర్థం చేసుకోవచ్చు. రాశి, వరుణ్ మధ్య సాగె రొమాన్స్, సరదా సన్నివేశాలు కట్టిపడేస్తాయని సెన్సార్ సభ్యులు తమ అభిప్రయాన్ని వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది.

    తక్కువ రన్ టైంతో రాబోతున్న రెండు చిత్రాలు

    తక్కువ రన్ టైంతో రాబోతున్న రెండు చిత్రాలు

    ప్రేక్షకుల సహనాన్ని ఎక్కువ పరీక్షించకుండా వీలైనంత తక్కువ టైంలో ఎంటర్ టైం చేసి పంపించడమే ఈ రెండు చిత్రాల ఉద్దేశంగా తెలుస్తోంది. ఇంటెలిజెంట్ చిత్రం 2 గంటల 10 నిమిషాల రన్ టైం కలిగి ఉంటె, తొలిప్రేమ చిత్రం రన్ టైం 2 గంటల 16 నిముషాలు.

     అలా జరిగితే యుద్ధమే

    అలా జరిగితే యుద్ధమే

    ఈ రెండు చిత్రాలకు పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద మెగాహీరోల యుద్ధం తప్పదని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సాయిధరమ్ తేజ్ చాల కాలంగా తేజు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుణ్ ఫిదా చిత్రంతో జోరుమీద ఉన్నాడు. ఇంటెలిజెంట్ చిత్రానికి వివి వినాయక్ దర్శకుడు కావడంతో యాక్షన్ ప్రియులు ఈ చిత్రంపై మినిమమ్ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఇక వరుణ్ తొలిప్రేమ చిత్రానికి రొమాంటిక్ ప్రియులు ఎగబడడం ఖాయం.

    English summary
    Varun Tej's Tholiprema and Saidharam Tej Inttelligent completes censor and both movies got UA
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X