TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
పవన్ కళ్యాణ్‌ను చూసినట్లే ఉంది: వరుణ్ తేజ్ ‘తొలి ప్రేమ’ ఫస్ట్ లుక్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై నిర్మితమవుతున్న చిత్రం తొలి ప్రేమ. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా పోస్టర్, ఇందులో వరుణ్ తేజ్ లుక్ చూసిన అభిమానులు..... వరుణ్ తేజ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌ను గుర్తు చేస్తున్నాడని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ హీరోగా 1998లో 'తొలిప్రేమ' పేరుతో ఓ సినిమా వచ్చింది. అప్పట్లో ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో ది బెస్ట్ చిత్రాల్లో ఈ చిత్రం ఒకటి. ఇపుడు అదే టైటిల్‌తో వరుణ్ తేజ్ హీరోగా మరో సినిమా వస్తోంది.
ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్ పోస్టర్
ఈ చిత్రం ద్వారా వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశి ఖన్నా హీరోయిన్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. పవన్ కళ్యాణ్ మూవీకి, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేక పోయినా..... అదే స్థాయిలో ఈ చిత్రం హిట్ అవుతుందని భావిస్తున్నారు.
క్యూట్ అండ్ ఎమోషనల్ లవ్‌స్టోరీ
సినిమా గురించి నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ``దర్శకుడు వెంకీ అట్లూరి ఓ క్యూట్ అండ్ ఎమోషనల్ లవ్‌స్టోరీని తెరకెక్కించారు. వరుణ్ తేజ్‌ను సరికొత్త క్యారెక్టర్‌లో ప్రేక్షకులు చూస్తారు. ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే బ్యూటీఫుల్ లవ్ ఎంటర్‌టైనర్... అని తెలిపారు.
రిలీజ్ డేట్ ఖరారైంది
డిసెంబర్లో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈచిత్రం జనవరిలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆ టైటిల్ అంటేనే ఎంతో క్రేజ్
‘తొలి ప్రేమ' టైటిల్ అంటేనే తెలుగు సినిమా అభిమానుల్లో, ముఖ్యంగా మెగా అభిమానుల్లో ఏదో తెలియని క్రేజ్ ఉంది. ఇపుడు ఇదే టైటిల్‌తో మెగా ఫ్యామిలీ హీరో నుండి మరో సినిమా వస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి.