మెగా అభిమానులకు సర్‌ప్రైజ్.. చిరు బర్త్ డే స్పెషల్.. ప్లాన్ చేసిన వరుణ్ తేజ్

మెగా అభిమానులకు పండుగ రోజు అంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అని చెప్పడంలో వింతేమీ లేదు. ప్రతీ ఏడాది ఆయన బర్త్ డేని ఎంతో స్పెషల్‌గా నిర్వహిస్తూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు మెగా ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా చిరంజీవి పుట్టిన రోజు సంబరాలు ఇప్పటికే మొదలు పెట్టేశారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తూ గతంలో కంటే ఎక్కువ హంగామా చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు. ఈ మెగా పండుగకు మరో రెండు రోజుల సమయమే ఉండటంతో ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పెదనాన్న పుట్టిన రోజున మెగా అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ చిరు కానుక ఇచ్చేందుకు సిద్దమయ్యాడు వరుణ్ తేజ్.

Varun Tejs Valmiki Team giving surprise for Chiranjeevi BirthDay

తన కొత్త సినిమా 'వాల్మీకి' నుంచి ''జర్రా.. జర్రా'' లిరికల్ వీడియోను ఆగస్టు 21 వ తేదీన అలాగే వీడియో సాంగ్ ప్రోమోను ఆగస్టు 22 వ తేదీన విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ మేరకు పాటకు సంబంధించిన పోస్టర్‌ను పంచుకుంది చిత్రయూనిట్. ఈ సినిమాలో వరుణ్ డిఫెరెంట్ లుక్‌లో ఆకట్టుకోనున్నాడు. ఇప్పటికే విడుదలైన వాల్మీకి అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.

హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది 'వాల్మీకి' మూవీ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్ గా వాల్మీకి రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 13 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X