బిగ్ బ్రేకింగ్: వాల్మీకి టైటిల్ మార్చేశారు.. తీరా రిలీజ్‌కు ముందు కోర్టు ఝలక్‌తో

Recommended Video

Valmiki Title Change || Valmiki Is Now Gaddalakonda Ganesh

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రాబోతున్న 'వాల్మీకి' సినిమాపై గతంలో రాజుకున్న వివాదం బాగా ముదిరింది. తీరా విడుదల తేదీ (సెప్టెంబర్ 20) దగ్గరపడిన తర్వాత కూడా విషయం సీరియస్ గానే ఉండటంతో వాల్మీకి టైటిల్ మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు దర్శకనిర్మాతలు. రేపే విడుదల కానున్న వాల్మీకి సినిమా టైటిల్ ఇప్పుడు మార్చడం హాట్ టాపిక్ అయింది.

ఆ రెండు జిల్లాల్లో..

ఆ రెండు జిల్లాల్లో..

సెప్టెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న వాల్మీకి చిత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, కర్నూలు జిల్లాలో మాత్రం నిలిచిపోనుందని వార్తలు వచ్చాయి. శాంతి భద్రతల దృష్ట్యా సినిమా విడుదలను నిలిపివేయాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు.

వెల్లువెత్తిన అభ్యంతరాలు

వెల్లువెత్తిన అభ్యంతరాలు

తమ ఆదేశాలను ధిక్కరించి వాల్మీకి చిత్రాన్ని విడుదల చేస్తే థియేటర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో జిల్లాలో అత్యధిక సంఖ్యలో నివసిస్తున్న వాల్మీకి, బోయ సామాజిక వర్గాలు.. వాల్మీకి చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చారని తెలిసింది.

చివరకు వాల్మీకి పేరు మార్చేశారు

చివరకు వాల్మీకి పేరు మార్చేశారు

తీరా విడుదల దగ్గరపడ్డాక కూడా వివాదాలు సద్దుమణగక పోవడంతో చివరకు టైటిల్ మార్చి విడుదల చేయాలని నిర్ణయించారు దర్శకనిర్మాతలు. ఈ మేరకు కొత్త టైటిల్ ఏంటో తెలుపుతూ అఫీషియల్ ప్రకటన జారీ చేశారు. దీంతో ఆ రెండు జిల్లాల్లో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.

ఇక వాల్మీకి సినిమా పేరు

ఇక వాల్మీకి సినిమా పేరు

వాల్మీకి సినిమా పేరును 'గద్దలకొండ గణేష్' గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ క్యారెక్టర్ పేరు గద్దలకొండ గణేష్. ఇదే పేరును సినిమా పేరుగా మార్చి విడుదల చేస్తున్నారు. వాల్మీకి విడుదలకు ఒక్కరోజు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.

 వాల్మీకి మూవీ డీటెయిల్స్

వాల్మీకి మూవీ డీటెయిల్స్

తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్ గా రాబోతోంది వాల్మీకి (గద్దలకొండ గణేష్) మూవీ. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X