మునుపెన్నడూ లేనివిధంగా ఒక పనిపూర్తి చేసిన వరుణ్ తేజ్.. గ్రావిటీకి అర్థం చెప్పేలా!
మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ లో తొలిసారి అంత్యంత ప్రయోగాత్మక చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ అంతరిక్ష పరిశోధనకు సంబందించిన చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ రూపొందించిన స్పేస్ సెంటర్ సెట్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. తొలి షెడ్యూల్ పూర్తి కావడం తో వరుణ్ తేజ్ సోషల్ స్పదించాడు.

మునుపెన్నడూ వెండి తెరపై రాని విధంగా 35 రోజులు తొలి షెడ్యూల్ పూర్తి చేశామని తెలిపాడు. ఈ షెడ్యుల్ మొత్తం గ్రావిటీ చుట్టూ తిరుగుతుంది. చిత్ర యూనిట్ మొత్తం చాలా బాగా పనిచేసింది. ఈ సందర్భంగా అదితి రావు, ఇతర చిత్ర యూనిట్ సభ్యులతో ఉన్నా ఫొటోని పోస్ట్ చేశాడు.
ఘాజి వంటి విజయవంతమైన ప్రయోగాత్మక చిత్రం తరువాత సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. వరుణ్ తేజ్ కూడా రెండు వరుస విజయాలతో మంచి జోష్ లో ఉన్నాడు.


Click it and Unblock the Notifications











