twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతరిక్ష నేపథ్యంతో వరుణ్ తేజ్ సినిమా ప్రారంభం (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    'ఫిదా', 'తొలి ప్రేమ' లాంటి చిత్రాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ తన తర్వాతి సినిమాను మొదలు పెట్టారు. 'ఘాజీ' ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఫస్ట్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి వై రాజీవ్ రెడ్డి, క్రిష్ జాగర్లమూడి నిర్మాతలు. అంతరిక్ష నేపథ్యంతో సాగే సినిమా కావడంతో అందుకు తగిన విధంగా ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్స్ వేస్తున్నారు.

    తెలుగులో ఇప్పటి వరకు రాని జోనర్

    తెలుగులో ఇప్పటి వరకు రాని జోనర్

    ఈ ప్రారంభోత్స వేడుకకు వరుణ్ తేజ్ తండ్రి నాగేంద్ర బాబు ముఖ్య అతిథిగా హాజరైన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ‘ఘాజీ' తరహాలోనే ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్టుతో, తెలుగులో ఇప్పటి వరకు రాని ఒక కొత్త జోనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రంలో విఎఫ్ఎక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి.

    వ్యోమగామిగా కనిపించబోతున్న వరుణ్ తేజ్

    వ్యోమగామిగా కనిపించబోతున్న వరుణ్ తేజ్

    ఈ సినిమాలో వరుణ్ తేజ్ వ్యోమగామి పాత్రాలో నటించబోతున్నాడు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠితో పాటు బాలీవుడ్ బ్యూటీ అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారతీయ సినిమాలో ఇది ఒక సరికొత్త మూవీ అని చిత్రబృందం చెబుతోంది.

    స్పేస్ కాన్సెప్టుతో కూడిన మూవీ

    స్పేస్ కాన్సెప్టుతో కూడిన మూవీ

    అంతరిక్ష నేపథ్యంతో సాగే సినిమా కావడంతో అందుకు తగిన విధంగా ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా సెట్స్ వేస్తున్నారు. ఇప్పటీకే ఈ చిత్ర షూటింగ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ హైదరాబాద్లోని ఒక ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ రూపొందించారు. జీరో గ్రావిటీ పరిస్థితులకు అనుగుణంగా షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నటీనటులు జీరోగ్రావిటీ శిక్షణ కూడా తీసుకున్నారు.

    విదేశాల్లోనూ షూటింగ్

    విదేశాల్లోనూ షూటింగ్

    ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ అమెరికాలో షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. జార్జియాలో ప్రత్యేకంగా వేసే సెట్లలో సినిమా చిత్రీకరిస్తారట. యాక్షన్ సీక్వెన్సుల కోసం హలీవుడ్ సాంకేతిక నిపుణులను ఎంపిక చేసినట్లు సమాచారం.

     నటీనటులు

    నటీనటులు

    ఈ చిత్రంలో వరుణ్ తేజ్,అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, రాజా, శ్రీనివాస్ అవసరాల, రఘు తదితరులు నటిస్తున్నారు.

    డిఓపి: జ్ఞానశేఖర్ విఎస్
    ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
    ప్రొడక్షన్ డిజైనర్స్: రామకృష్ణ సబ్బాని, మౌనిక సబ్బాని
    సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి
    డైలాగ్స్ : కిట్టు విస్సప్రగడ
    కాస్టూమ్స్: అశ్వంత్ బైరి
    స్టంట్స: టాడోర్ లజరోవ్
    సి.జి.:రాజీవ్ రాజశేఖరన్
    ఎస్ఎఫ్ఎక్స్: మైష్ త్యాగి
    పిఆర్ఓ: వంశీ శేఖర్
    నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, క్రిస్, సాయి బాబు
    దర్శకత్వం: సంకల్ప్ రెడ్డి

    English summary
    "Very happy to kick start my next venture with Sankalp Reddy. Really happy to be associated with Rajeevreddy, Krish Jagarlamudi & gnanash ekarvs once again after Kanche. Welcome onboard you two Lavanya Tripathi, Aditi Rao Hydari. Really really excited about this one!" Varun Tej said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X