twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అబ్దుల్ కలాంకి, వరుణ్ తేజ్‌కి లింకేంటి.. రామేశ్వరంలో హంగామా!

    |

    రెండు వరుస రొమాంటిక్ హిట్స్ తరువాత వరుణ్ తేజ్ భిన్నమైన కథని ఎంచుకున్నాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం స్పేస్ థ్రిల్లర్ గా రాబోతోంది. రానా, అదితి వ్యోమగాములుగా కనిపించబోతున్నారు. ఘాజి చిత్రం తరువాత సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

    రామేశ్వరంలో

    రామేశ్వరంలో

    ఈ చిత్రం ప్రస్తుతం రామేశ్వరంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది. షూటింగ్ జరుగుతోంది కూడా చాలా ప్రత్యేకమైన స్థానంలో. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చదివిన స్కూల్ లో సంకల్ప్ రెడ్డి కీలక సన్నివేసాలు చిత్రీకరిస్తున్నారు.

    లింకేంటి

    వరుణ్ తేజ్ చిత్రానికి, అబ్దుల్ కలాం స్కూల్ కి లింకేంటి అనే ఆసక్తి అభిమానుల్లో కలుగుతోంది. ఈ చిత్రం స్పేస్ సైన్స్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. భారత జాతి గర్వించదగ్గ శాస్త్ర వేత్తగా అబ్దుల్ కలాం అద్భుత విజయాలు సాధించారు. ఆ కోణంలో ఏమైనా సన్నివేశాలు ఉండవచ్చు.

    అదితి హంగామా

    షూటింగ్ గ్యాప్ లో అదితి రామేశ్వరంలో హంగామా చేస్తోంది. అబుల్ కలాం స్కూల్ లో వరుణ్ తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్థానికంగా మహిళలు వండిన రుచికరమైన వంటకాల్ని బాగా ఆరగించినట్లు కూడా అదితి రావు తెలిపింది.

    వరుణ్

    వరుణ్

    వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలోని చిత్రం షూటింగ్ జరుగుతుండగా, మరోవైపు వెంకీతో మల్టి స్టారర్ చిత్రం ఎఫ్ 2 కూడా ప్రారంభమైంది.

    English summary
    Varun Tej, Sankalp Reddy movie shooting at Rameswaram. Adithi shares crazy pics
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X