అలా చేస్తుందనే నిహారికను కొడుతా.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్
Varun Tej: మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ అమ్మడు మెగా ఫ్యామిలీ వారందరితో చాలా సరదాగా ఉంటుంది. నాగబాబుకు తన కూతురు నిహారిక అంటే ప్రాణం. ఆమె కోసం ఏదైనా చేస్తారు. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన నిహారిక.. అటు యాంకర్ గారు ఇటు నటిగాను నిర్మాతగాను వ్యవహరిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ అమ్మడుపై పై తన అన్నయ్య వరుణ్ తేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మెగా డాటర్ నిహారిక కొణిదల ఇండస్ట్రీలో యాంకర్‌గా, హీరోయిన్ గా, నిర్మాతగా మంచి పేరు దక్కించుకుంది. నీహారిక నటిగా కెరీర్‌ని కొనసాగించే ముందు బుల్లితెర ప్రముఖ షో అయిన ఢీ జూనియర్ 1, ఢీ జూనియర్ 2 విభాగాలకు ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షోను హోస్ట్ చేసింది. తర్వాత ఒక మనసు చిత్రంలో నాగ శౌర్య సరసన నటించి, మంచి తన నటనతో మూవీ ఫ్లాప్ టాక్ దక్కించుకుంది. ఓరు నల్ల నాల్ పాతు సోల్రెన్, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహా రెడ్డి, డార్లింగ్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా,హోస్ట్ రోల్స్ లో , హీరోయిన్ కు ఫ్రెండ్ గా నటించింది.

అల్ట్రా మోడ్రన్ గర్ల్ నిహారిక తన గ్లామర్ షోతో ప్రేక్షకులను కట్టిపడేసింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో 'ముద్దపప్పు ఆవకాయ్' అనే సిరీస్ లో నటించడంతో పాటు తానే స్వయంగా నిర్మించింది. ఇదే సమయంలో నిహారిక నిర్మాతగా కూడా మారి.. ఓ సినిమాను నిర్మించారు. నిహారిక సమర్పణలో పింక్ పిక్చర్స్ దామోదర్ బ్యానర్‌పై 'కమిటీ కుర్రాళ్లు' అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా నిహారిక తమిళంలో 'మద్రాస్‌కారన్' మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ
సాంగ్ సోషల్ మీడియాలో అందర్ని షేక్ చేసింది.
ఇదెలా ఉంటే.. హీరో వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన చెల్లితో తాను ఎప్పుడు పోట్లాడుతానని, తన చెల్లి ఎక్కువగా అబద్ధాలు చెప్తుంది అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇద్దరి మధ్య చిన్నప్పట్నుండి చీటికిమాటికి ప్రతి విషయంలో కొట్లాడుకుంటూనే ఉండే వాళ్ళమని, ఇప్పటి కూడా అలానే ఉందని, కానీ ఇప్పుడు తనది పై చేయి అని ఫన్నీ కామెంట్స్ చేశారు. ఈ ప్రస్తుతం ఈ వీడియో నితిన్ లో వైరల్ కావడంతో వీరి సోదర బంధం పై మెగా ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లో ఇలాంటివి కామన్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో నిహారిక రెండవ వివాహం గురించి పలు రూమర్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఓ సెలబ్రిటీతో ప్రియమైన కొనసాగిస్తున్నారని, వీరి ప్రేమ బంధానికి మెగా కుటుంబం కూడా ఓకే చెప్పిందని పలు పుకార్లు షికారులు చేస్తున్నాయి. అయితే వీటిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సో ఈ వార్తలలో నిజం లేదని చెప్పాలి. ఏదేమైనా నిహారిక తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. అటు యాంకర్ గా నటిగా నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీలో రాణిస్తుంది.


Click it and Unblock the Notifications











