సోగ్గాడు: వరుణ్ తేజ్ సౌత్ స్కోప్ లుక్ కేక....

By Bojja Kumar

హైదరాబాద్: ‘ముకుంద' చిత్రం ద్వారా హీరోగా తెరంగ్రేటం చేసిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పెర్ఫార్మెన్స్ మాత్రమే కాదు....మంచి హైటు, పర్సనాలిటీ, స్మార్ట్ లుక్ ఉండటంతో వరుణ్ తేజ్ త్వరలోనే హైరేంజికి ఎదుగుతాడని అంటున్నారు.

తాజాగా వరుణ్ తేజ్ ‘సౌత్ స్కోప్ -2015' క్యాలెండర్‌పై దర్శనమివ్వబోతున్నాడు. ఈ రోజు వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఇందుకు సంబంధించిన లుక్ బయటకు విడుదలైంది. అతని రగ్గెడ్ మాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రెండీ డీజిల్ బ్రాండ్ ఔట్ ఫిట్స్ ధరించిన హార్లే డేవిడ్సన్ బైకుపై వరుణ్ తేజ్‌ రిలాక్స్ అవుతున్నట్లు ఉన్న ఈ లుక్.....అతని ఇమేజ్ మరింత పెంచే విధంగా ఉంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Varun Tej South Scope 2015 calendar look

వరుణ్ తేజ్ తర్వాతి సినిమా విషయానికొస్తే...పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చిత్ర నిర్మాత సి. కల్యాణ్ ఈ మేరకు ఈ విషయాన్ని ధృవీకరించారు. పూరి జగన్నాథ్ వరుణ్‌ను తెరపై సరికొత్తగా ప్రజెండ్ చేయబోతున్నట్లు తెలిపారు.

తొలి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది. అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట. కాగా...దీని తర్వాత మరో చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్నాడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X