చిరంజీవి, పవన్ కళ్యాణ్ అన్నీ అన్నయ్యే... భారతీయుడిగా గర్వపడతారు: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'అంతరిక్షం 9000'. సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై క్రిష్ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించారు. డిసెంబర్ 21న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు వరుణ్ తేజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘అంతరిక్షం’ చాలా అరుదైన సినిమా
నాకు ఎప్పుడూ వెరైటీగా ట్రై చేద్దాం, ఏదైనా కొత్తగా చేద్దాం అని ఉంటుంది. సంకల్ప్ ఈ కథ చెప్పినపుడు ఒక కొత్తరకమైన సినిమా చేద్దామని మోటివేట్ అయ్యాను. మనకు ప్రతివారం చాలా సినిమాలు వస్తాయి. కానీ అంతరిక్షం లాంటి సినిమా చాలా అరుదుగా వస్తుందని వరుణ్ తేజ్ తెలిపారు.

ఫైట్లు చేస్తే జనాలు గాల్లో ఎగరాలని నాకూ ఉంటుంది
ఫస్ట్ సినిమాతోనే ఢిల్లీ నుంచి అప్రిషియేషన్ రావడం, నేషనల్ అవార్డు గెలవడం, అందులోనూ ఒక కొత్తబ్బాయి గెలవడం మామూలు విషయం కాదు. సెకండ్ సినిమా కూడా అద్భుతమైన పాయింటుతో చేశాడు. నెక్ట్స్ టైమ్ అయినా సంకల్ప్ నేల మీద ఉండే సినిమాలు చేస్తాడని కోరుకుంటున్నాను. ఫైట్లు చేస్తే జనాలు గాల్లోకి ఎగరాలని నాకూ ఉంటుంది. అలాంటి కథ ఎక్స్ పెక్ట్ చేస్తే సంకల్ప్ సగం సినిమాలో నన్ను గాల్లో ఎగరేసి పెట్టాడు. సినిమా మొత్తం వేలాడుతూనే ఉన్నాను.

చిరంజీవిగారు, పవన్ కళ్యాణ్ గారు అన్నీ అన్నయ్యే
నేను మాట్లాడుతుంటే మీ నుంచి కళ్యాణ్ బాబాయ్ పేరు వినపడుతోంది. కళ్యాణ్ బాబాయ్ ఇక్కడ లేడనుకుంటున్నారా? కానీ నా వెనకాల ఉన్నాడు. మెగా పవర్ స్టార్.... చిరంజీవిగారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ నా వెనకాల ఉన్నట్లు ఉంది. ఈ ఫంక్షన్ కు వచ్చి సపోర్ట్ చేసిన చరణ్ అన్నకు థాంక్స్. ఇలాంటి సినిమా ఒప్పుకునే ముందు జనాలు యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనే డౌట్ ఉండేది. చరణ్ అన్న దగ్గరకు వెళ్లి ఈ సినిమా ట్రై చేయాలంటే భయంగా ఉంది అన్నాను. అప్పుడు అన్నయ్య నువ్వు నమ్ముకున్న కథ కరెక్ట్, డైరెక్టర్ సరైనోడు అని చెప్పాడు. ఇలాంటి సినిమా చేస్తే బావుంటుందని ఎంకరేజ్ చశాడు.

భారతీయుడిగా, మెగా అభిమానిగా గర్వపతారు
ఈ సినిమా చూసిన తర్వాత నేనొక భారతీయుడిని అని అందరూ గర్వపడతారు. నేనొక తెలుగు వాడిని అని అందరూ గర్వపడతారు. నేను ఈ సినిమా చేసినందుకు మెగా అభిమానిగా మీరందరూ గర్వపడారని చెప్పగలను అని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











