Gandeevadhari Arjuna Twitter Review: వరుణ్ మూవీకి షాకింగ్ టాక్.. ఆ సీన్స్ తప్ప అంతా.. హిట్ బొమ్మేనా?

మెగా ఫ్యామిలీ నుంచి ఎందరో కుర్రాళ్లు హీరోలుగా ఎంటర్ అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని దూసుకుపోతోన్నారు. అందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. ఆరంభం నుంచే వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అతడు.. ఎన్నో విజయాలను కూడా అందుకుని సత్తా చాటాడు. కానీ, గత చిత్రం మాత్రం నిరాశ పరిచింది. దీంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' అనే మూవీతో వచ్చేశాడు. ఇంకెందుకు ఆలస్యం? ఈ మూవీ ట్విట్టర్ రివ్యూను మీరే చూసేయండి!

గాండీవధారి అర్జునగా వరుణ్:మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రమే 'గాండీవధారి అర్జున'. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌గా.. నాజర్, విమలా రామన్, వినయ్ రాజ్, అభినవ్ గోమటం కీలక పాత్రలు చేశారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించాడు.

 Varun Tej Starrer Gandeevadhari Arjuna Movie Twitter Review

అలాంటి కథతో వచ్చిందిగా:ప్రముఖులకు బాడీగార్డులను నియమించే సంస్థలో పని చేసే హీరోకు ఓ మిషన్‌ను అప్పగిస్తారు. అక్కడ అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? తన విధులను సక్రమంగా చేశాడా లేదా? మాతృ దేశం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అనే అంశాలతో 'గాండీవధారి అర్జున' మూవీ తెరకెక్కింది. హై రేంజ్ యాక్షన్‌తో ఈ సినిమా రావడంతో దీనిపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ఫస్టాఫ్ బిలో ఏవరేజ్ అంటూ:వరుణ్ తేజ్ నటించిన 'గాండీవధారి అర్జున' మూవీ ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ప్రదర్శితం అయింది. దీన్ని చూసిన ఓ నెటిజన్ ఇలా స్పందించారు. 'గాండీవధారి అర్జున ఫస్టాఫ్ బిలో ఏవరేజ్‌గా ఉంది. మెప్పించగ్గ ఒక్క ఇంటర్వెల్ సీక్వెన్స్ తప్ప ఇప్పటి వరకూ సినిమాలో వచ్చిన స్టోరీ మొత్తం చాలా ఫ్లాట్‌గానే సాగింది' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

సెకెండాఫ్ కూడా అదే రేంజ్:వరుణ్ తేజ్ - సాక్షి వైద్య జంటగా నటించిన 'గాండీవధారి అర్జున' మూవీని చూసిన మరొక నెటిజన్ ట్విట్టర్ ఖాతాలో 'ఫస్టాఫ్ మాదిరిగానే సెకెండాఫ్ కూడా ఏమాత్రం ప్రభావం చూపలేదు. పైగా క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉంది. మొత్తం మూవీలో ఒక్క హై మూమెంట్ కూడా లేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఏవరేజ్. మొత్తం మీద వరుణ్‌కు మంచి కమ్‌బ్యాక్ రావాలి' అని పేర్కొన్నారు.

సింపుల్‌గా సమర్పణంగా:ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన 'గాండీవధారి అర్జున' మూవీని చూసిన ఇంకొక నెటిజన్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయం వెల్లడించారు. ఇందులో 'ఫస్టాఫ్ యావరేజ్‌గా సాగే బొమ్మ. అంతగా ఆసక్తిని రేకెత్తించలేదు. సెకెండాఫ్ ఏదో ఎంగేజింగ్‌గా ఉంటుంది అనుకుంటే.. ఫస్టాఫ్ కంటే వరస్ట్‌గా ఉంది. సింపుల్ సమర్ఫణం' అంటూ రాసుకొచ్చారు.

అద్భుతమైన యాక్షన్‌తో:వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన 'గాండీవధారి అర్జున' మూవీని చూసిన వేరే నెటిజన్ ట్విట్టర్‌లో ఇలా చెప్పుకొచ్చారు. 'గాండీవధారి అర్జున మూవీలో అద్భుతమైన యాక్షన్ ఉంది. అలాగే, వరుణ్ తేజ్ మాస్ యాక్టింగ్‌ ఆకట్టుకుంది. ఈ సినిమాకు నా రేటింగ్ 3.25/5. మిగిలినవి ప్రేక్షకులు పిక్ చేసుకుంటారు' అంటూ తెలిపారు.

డైరెక్టర్ అస్సలు మారలే:'గాండీవధారి అర్జున' మూవీని వీక్షించిన మరో నెటిజన్ దర్శకుడిపై విమర్శలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'తన గత డిజాస్టర్ చిత్రాల పరంపర నుంచి ప్రవీణ్ సత్తారు ఏమాత్రం మెరుగుపడలేదు. మంచి పాయింట్‌తో స్టోరీని అల్లుకోవడంలో అతడి వైఫల్యం కనిపిస్తోంది. ఒక్క సీక్వెన్స్ కూడా ప్రభావం చూపలేదు. పూర్తిగా నిరాశ చెందాను' అంటూ చెప్పారు.

పని చేయని యాక్షన్ థ్రిల్లర్:'గాండీవధారి అర్జున' మూవీని వీక్షించిన మరో నెటిజన్ ఇలా స్పందించాడు. 'గాండీవధారి అర్జున ఓవరాల్‌గా అస్సలు వర్కౌట్ కాని యాక్షన్ థ్రిల్లర్. సినిమాను చాలా స్టైలిష్‌గా తీశారు కానీ, ఇందులో ఎలాంటి గట్టి సారాంశం లేదు. చాలా రొటీన్ సన్నివేశాలతో సాగుతుంది. సినిమాటోగ్రఫీ, కొన్ని సీన్స్ మినహా మిగిలినదంతా చాలా బోరింగ్‌గా ఉంటుంది' అని చెప్పుకొచ్చారు.

ఓవరాల్‌గా అలాంటి టాక్:వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గాండీవధారి అర్జున' మూవీపై వచ్చిన ట్వీట్లలో మెజారిటీవి నెగెటివ్‌గానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మొత్తం ఫ్లాట్‌గా సాగిపోతుందని, కొత్తదనం లేని అంశాలతో నిండి ఉందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కొన్ని సన్నివేశాలు మినహా సినిమా అంతా సోసోగా వెళ్లిపోతుందని చెప్పారు. రాను రానూ టాక్ ఏమైనా మారుతుందేమో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X