పదో తరగతిలోనే అది జరిగింది.. పూజా హెగ్డేతో డేటింగ్.. సీక్రెట్స్ బయటపెట్టిన వరుణ్ తేజ్
మెగా వారసుడు, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్నాడు. ఇటీవలే ఆయన నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం సాధించిన విజయం ఆయనలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో పలు రియాలిటీ షోల్లో పాల్గొంటున్న వరుణ్.. తన గత జీవితం, భవిష్యత్‌కి సంబంధించిన పలు విషయాలపై ఓపెన్‌గా స్పందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా పూజా హెగ్డేపై ఈ హీరో చేసిన కామెంట్ సంచలనంగా మారింది. పూర్తి వివరాలు చూస్తే..

యాంకర్ శ్రీముఖి ప్రపోజ్ చేయగా.. వరుణ్
గద్దలకొండ గణేష్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేశాడు వరుణ్ తేజ్. ఈ స్టేజీపై వరుణ్ తేజ్‌కి లవ్ ప్రపోజల్స్ పెట్టారు ఫిమేల్ కంటిస్టెంట్స్. ఇందులో భాగంగా గులాబీ చేత పట్టుకొని వరుణ్ తేజ్‌కి యాంకర్ శ్రీముఖి లవ్ ప్రపోజ్ చేయగా.. ఇప్పుడొద్దు, టీవీలో అందరూ చూస్తున్నారంటూ ఆసక్తికరంగా స్పందించాడు.

మంచు లక్ష్మితో పడక గది రహస్యాలను బయటపెట్టే షో..
ఇక మరో షో.. 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు వరుణ్ తేజ్. సెలెబ్రిటీల పడక గది రహస్యాలను బయటపెట్టే షోగా పాపులారిటీ తెచ్చుకుంటున్న ఈ షోకి మంచు లక్ష్మి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. సెలబ్రిటీల అంతరంగిక విషయాలను ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం దిశగా ఈ కార్యక్రమం డిజైన్ చేశారు. తాజాగా ఇదే కార్యక్రమంలో వరుణ్ తేజ్ చేత సీక్రెట్స్ బటయపెట్టించింది మంచు లక్ష్మి.

తొలిముద్దు, అమ్మాయిలు, డేటింగ్
తొలిముద్దు, అమ్మాయిలు, డేటింగ్ సంబంధిత ప్రశ్నలతో మెగా వారసుడిని ఉక్కిరిబిక్కిరి చేసింది మంచు వారమ్మాయి. తొలిముద్దు ఎప్పుడు పెట్టావు? సాయిపల్లవి, రాశీ ఖన్నా, పూజా హెగ్డేలలో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావ్, ఎవరిని చంపేస్తావ్, ఎవరితో రిలేషన్‌షిప్ పెట్టుకుంటావ్? అని మంచు లక్ష్మి ప్రశ్నించింది.

పదో తరగతిలోనే.. ఆ ముగ్గురితో ఇలా చేస్తా
మంచు లక్ష్మి సంధించిన ప్రశ్నలపై స్పందించిన వరుణ్.. తనకు తొలిముద్దు అనుభవం పదో తరగతిలోనే జరిగిందని చెప్పాడు. ఇక ఆ ముగ్గురు హీరోయిన్లలో సాయి పల్లవిని పెళ్లిచేసుకుంటానని, పూజా హెగ్డేతో డేటింగ్ చేస్తానని, అలాగే రాశీ ఖన్నాను చంపేస్తానని పేర్కొంటూ ఆసక్తికరంగా స్పందించాడు వరుణ్ తేజ్.

గతంలో ఆ ముగ్గురు హీరోయిన్లతో..
సాయి పల్లవితో కలిసి 'ఫిదా' సినిమాలో, రాశీ ఖన్నా జోడీగా తొలిప్రేమ సినిమాలో అలాగే పూజా హెగ్డేతో కలిసి ఇటీవలే గద్దలకొండ గణేష్ సినిమాలో నటించాడు వరుణ్ తేజ్. మొత్తానికి ఆ ముగ్గురు హీరోయిన్లపై వరుణ్ తేజ్ వ్యక్తపరిచిన స్పందన యువతను బాగా ఆకట్టుకుంది.

గద్దలకొండ గణేష్ హవా..
మరోవైపు వరుణ్ తేజ్ తాజా సినిమా గద్దలకొండ గణేష్ హవా సాగుతోంది. సెప్టెంబర్ 20న విడుదలైన ఈ సినిమా ఆశించిన మేర రెస్పాన్స్ తెచ్చుకొని సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. చిత్రంలో వరుణ్ తేజ్, పూజా హెగ్డే నటనకు మంచి మార్కులు పడగా, హరీష్ శంకర్ దర్శకత్వ ప్రతిభ భేష్ అనిపించుకుంటోంది.


Click it and Unblock the Notifications











