అప్పుడు రామ్ చరణ్.. ఇప్పుడు వరుణ్ తేజ్.. మెగా ఫ్యామిలీలో కరోనా టెన్షన్
మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు, ఆయన సతీమణి పద్మజ కరోనా బారిన పడ్దారు.. మొత్తానికి వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఇక ఆ మధ్య చిరంజీవి తనకు కరోనా సోకిందని, మళ్లీ కరోనా పరీక్షల్లో తప్పు జరగడంతో ఫలితం తేడాగా వచ్చిందని అభిమానులకు ఉపశమనం కలిగించాడు. అయితే తాజాగా రామ్ చరణ్ కరోనా బారిన పడ్డాడని ప్రకటించడం అందరూ షాక్ అయ్యారు.
రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించడంతో అందరూ అందోళన చెందుతున్నారు. ఎందుకంటే రెండ్రోజుల క్రితం రామ్ చరణ్ఆచార్య సెట్‌లో సందడి చేశాడు. డైరెక్టర్ కొరటాల శివ, సెట్ డిజైనర్‌లతో కలిసి సందడి చేశాడు. దీంతో ఆచార్య షూటింగ్ యూనిట్ అంతా ఆలోచనలో పడ్డారు. అయితే రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించిన రెండు మూడు గంటలకే మరో మెగా హీరో కరోనా బారిన పడ్డాడు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు వరుణ్ తేజ్ ఓ ప్రకటన చేశాడు. తనకు కరోనా పాజిటివ్ అని తెలిపాడు. ఈ రోజు ఉదయం నుంచి కొంత నలతగా ఉంది..కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది.. సరైన జాగ్రత్తలు తీసుకుంటూ.. హోం క్వారంటైన్‌లో ఉంటున్నాను. త్వరలోనే మళ్లీ వస్తాను.. మీ అందరి ప్రేమకు థ్యాంక్స్ అంటూ వరుణ్ తేజ్ ప్రకటించాడు.


Click it and Unblock the Notifications











