For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్లెజెంట్: వరుణ్ 'తొలిప్రేమ' టీజర్.., బాబాయిని మరిపిస్తాడా? (వీడియో)

  |
  వరుణ్ 'తొలిప్రేమ' టీజర్ వచ్చేసింది..!

  "పవన్ తొలిప్రేమ పన్నెండు సార్లు ఇక్కడ..", ఒకప్పటి ఆ క్లాసిక్ సినిమా ప్రస్తావన వస్తే.. అభిమానుల నుంచి ఇలాంటి డైలాగ్స్ చాలానే వినిపిస్తాయి. అంతలా వాళ్లను కట్టిపడేసిన సినిమా అది.

  అప్పటిదాకా పవన్ చేసిన మూడు సినిమాలకు.. ఆ సినిమా పూర్తి భిన్నమైనది. ఒకరకంగా పవన్ లోని నటుడిని తట్టిలేపిన సినిమా. భావోద్వేగాల కలబోతతో 'తొలిప్రేమ' చేసిన మ్యాజిక్ ఎన్నిసార్లు చూసిన తనివితీరదని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో!. ఇప్పుడదే టైటిల్‌తో.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా చేస్తుండటం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

  "తొలిప్రేమ" మళ్ళీ ఒకసారి: 20 ఏళ్ళ తర్వాత పవన్ సినిమా సీక్వెల్

   వరుణ్ 'తొలిప్రేమ' టీజర్:

  వరుణ్ 'తొలిప్రేమ' టీజర్:

  వరుణ్ తేజ్-వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'తొలిప్రేమ' టీజర్ తాజాగా విడుదలైంది. బ్యాక్ గ్రౌండ్‌లో ప్లెజెంట్ మ్యూజిక్.. జ్ఞాపకాలేవో వెంటాడుతున్న వ్యక్తిలా బీచ్ ఒడ్డున నడుస్తూ వరుణ్ తేజ్.. మొత్తంగా ఫీల్ గుడ్ అనుభూతిని కలిగించేలా ఉంది టీజర్. 'మ‌న లైఫ్ లోకి ఎంత‌మంది అమ్మాయిలు వ‌చ్చినా ఫ‌స్ట్ ల‌వ్ మాత్రం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేం' అంటూ వరుణ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

   'తొలిప్రేమ' రెండోసారి?:

  'తొలిప్రేమ' రెండోసారి?:

  పవన్ కల్యాణ్ కెరీర్ లో తొలిప్రేమ ఓ మైలురాయి. ఆయన ఎన్ని సినిమాలు చేసిన ఆ సినిమా స్థానం ప్రత్యేకం. ఓవైపు సిస్టర్ సెంటిమెంట్, మరోవైపు కీర్తిరెడ్డితో ప్రేమ.. ఆ రెండింటిని తెరపై అద్భుతంగా మలిచిన తీరు ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న 'తొలిప్రేమ'కు వరుణ్ తేజ్ ఏ మేర న్యాయం చేస్తాడన్నది ఆసక్తిని రేకెత్తిస్తోన్న విషయం.

   ఏం చేస్తారో?:

  ఏం చేస్తారో?:

  క్లాసిక్స్‌గా నిలిచిన టైటిల్స్‌తో మళ్లీ సినిమాలు చేయడం ఇప్పుడు కొత్తేమి కాదు. అయితే కథా బలం, స్క్రీన్ ప్లే, పెర్ఫామెన్స్, అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరితేనే మళ్లీ అలాంటి మ్యాజిక్‌లు రిపీట్ అవుతాయి. లేదంటే.. ఒక మంచి సినిమా టైటిల్‌ను అనవసరంగా వాడుకున్నారన్న విమర్శ రాకుండా ఉండదు.

   బాబాయిని మరిపిస్తారా?

  బాబాయిని మరిపిస్తారా?

  ఒకరకంగా 'తొలిప్రేమ'తో వరుణ్ తేజ్ రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. తొలిప్రేమ అనేసరికి.. కచ్చితంగా వరుణ్ తేజ్ పెర్ఫామెన్స్‌ను పవన్ కల్యాణ్‌తో పోల్చి చూడటం కామన్. కాబట్టి వరుణ్ తేజ్ ఆ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి. బాబాయిని మరిపిస్తారా?.. ఆ పాత్రకు మరింత ఆకర్షణ తీసుకొస్తారా? లేదా అన్నది చూడాలి.

  ప్రస్తుతం నిర్మాణంలో..:

  వరుణ్-వెంకీ అట్లూరి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీయస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వరుణ్ సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణపనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

  English summary
  Mega Prince Varun Tej is sporting a stunning look at his upcoming film Tholi Prema. The film is going to be an interesting one in his career as this is going to be a complete romantic entertainer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X