వరుణ్ తేజ్ 'తొలిప్రేమ' ట్రైలర్: బ్యూటిఫుల్.. ఇంప్రెషన్ కొట్టేశాడుగా!(వీడియో)
Recommended Video

జీవితం కొన్ని జ్ఞాపకాల్ని ఎప్పటికీ పదిలంగా ఉంచుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు నెమరేసుకుంటేనో.. జీవితంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటేనో.. గుండెను కాస్త తడి చేసే జ్ఞాపకాలు ఎప్పుడూ ప్రత్యేకమే. అందులో 'తొలిప్రేమ' ఇంకా ఇంకా ప్రత్యేకమైనది. ఇప్పుడా 'తొలిప్రేమ'లో మునిగితేలుతున్న వరుణ్ తేజ్.. ట్రైలర్ తో మన ముందుకొచ్చాడు..
ఇలా మొదలైంది..:
'జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా.. మనతోనే ఉంటాయి.. మోయక తప్పదు..' అనే ఫీల్ గుడ్ డైలాగ్‌తో ట్రైలర్ ఓపెన్ చేశారు. తొలిప్రేమకు కావాల్సిన అన్ని భావోద్వేగాలతో.. ట్రైలర్ ఆసాంతం ఆకట్టుకునేలా సాగింది.

తొలిచూపులోనే..:
తొలిప్రేమ ట్రైలర్‌లో తొలిచూపులోనే వరుణ్ తేజ్ రాశిఖన్నాతో ప్రేమలో పడే సన్నివేశాన్ని కూడా చూపించారు. 'జీవితంలో నాకేది ఎగ్జయిట్‌మెంట్ అనిపించేది కాదు. కానీ ఫస్ట్ టైమ్ వర్షను ట్రైన్‌లో చూసినప్పుడు ఏదో తెలియని ఎగ్జయిట్‌మెంట్.' అన్న డైలాగ్‌తో 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' సీన్ బ్యూటిఫుల్ ఫీల్ కలిగించేలా ఉంది.

పోయెటిక్ డైలాగ్..:
'కలలా వచ్చావు
కలగంటున్నప్పుడు వెళ్లిపోయావు
మళ్లీ ఇన్నాళ్లకిలా మెరిశావు
కలో నిజమో అర్థం కాలేదు'.. అంటూ వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ పోయెటిక్‌గా ఆకట్టుకునేలా ఉంది. తొలి చూపులోనే హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ హీరోకి.. మళ్లీ చాన్నాళ్ల తర్వాత గానీ ఆమె ఎదురపడలేదన్న విషయం ఈ డైలాగ్‌తో అర్థమవుతోంది.

మెరిసిన ప్రియదర్శి..:
ట్రైలర్‌లో ఒక చోట కమెడియన్ ప్రియదర్శి కూడా తళుక్కున మెరిశాడు. అన్నయ్యా.. అంటూ రాశిఖన్నా అతనికి షేక్ హ్యాండ్ ఇవ్వడం.. 'అన్నయ్యా' అంటావా? అని అతను షాక్ తినడం.. ఇండైరెక్ట్‌గా రాశిఖన్నా వరుణ్‌పై తన ప్రేమను తెలియజేసే ఆ సరదా సీన్ చాలా బాగుంది.

ట్రైలర్ 'కథ' ఇదీ..:
హీరోయిన్ చేత ఐలవ్యూ చెప్పించుకోవాలనుకునే హీరో.. హీరోపై ఇష్టమున్నా.. తన మనసులోని మాటను మాత్రం బయటపెట్టని హీరోయిన్.. కాలేజీ నేపథ్యంలో జరిగే కొన్ని గొడవలు.. ఫైనల్‌గా వరుణ్ 'తొలిప్రేమ'లో నెగ్గాడా? లేడా?.. అన్న సస్పెన్స్‌తో ట్రైలర్‌ను వదిలారని చెప్పాలి.


Click it and Unblock the Notifications











