మెగా ఫ్యామిలీలో ఆ హీరో పవన్ కళ్యాణ్ వైపే!

By Bojja Kumar

హైదరాబాద్: ఓ వైపు అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో మంచి హోదాలో కొనసాగుతున్న తరుణంలో....తమ్ముడు పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ పేరుతో కొత్త పార్టీ పెట్టడం మెగా ఫ్యామిలీలో ఎవరికీ నచ్చలేదు. పవన్ కళ్యాణ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము మద్దతివ్వం, మేము ఈ స్థాయికి రావడానికి కారణమైన అన్నయ్య చిరంజీవికే మా మద్దతు అంటూ.......నాగబాబు, నా మద్దతు నాన్నకే అని రామ్ చరణ్ మీడియా ముఖంగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

వారి ప్రకటనతో మెగా ఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్ ఒంటరి అయిపోయినట్లే అని అంతా అనుకున్నారు. కానీ బాబాయ్ పవన్ కళ్యాణ్‌కు మద్దతు ప్రకటించడం ద్వారా నేను నీ వైపే ఉన్నానని చెప్పకనే చెప్పాడు అప్ కమింగ్ మెగా హీరో వరుణ్ తేజ్. పవన్ రాజకీయ ప్రసంగంపై వరుణ్ తేజ్ ట్విట్టర్లో స్పందిస్తూ....'బాబాయ్ తన ప్రసంగంలో స్ట్రైట్ ఫార్వర్డ్‌గా మాట్లాడారు. ఆయన స్పీచ్ అదరిపోయింది' అంటూ ట్వీట్ చేసారు.

Varun Tej tweet about Pawan Kalyan speech

వరుణ్ తేజ్ సినిమా వివరాల్లోకి వెళితే....వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమైంది. మెగా రేంజికి తగిన విధంగా గ్రాండ్‌గా ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది.

గతంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'కొత్త బంగారు లోకం' లాంటి చిత్రాలను తెరకెక్కించిన అనుభవం ఉన్న శ్రీకాంత్ అడ్డాల వరుణ్ తేజ్ మొదటి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లియో ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X