»   » పవన్ పార్టీ వేళ: వరణ్ తేజ్ ‘గాడిద’ సెటైర్ ఎవరిపై?

పవన్ పార్టీ వేళ: వరణ్ తేజ్ ‘గాడిద’ సెటైర్ ఎవరిపై?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Varun Tej
హైదరాబాద్: ఒక వైపు బాబాయ్ పవన్ కళ్యాణ్ 'జన సేన' పేరుతో కొత్త పార్టీ మొదలు పెడుతున్న హడావుడి సాగుతున్న నేపథ్యంలో.........నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ట్విట్టర్ పోస్ట్ సర్వత్రా చర్చనీయాంశం అయింది. గత కొంత కాలంగా సోషల్ నెట్వర్కింగులో బాగా పాపులర్ అయిన 'గాడద‌తో ఓ జంట' సెటైర్‌ను వరుణ్ తేజ్ పోస్టు చేసాడు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల తరుణంలో వరుణ్ తేజ్ ఇలాంటి పోస్టు చేయడాన్ని......రకరకాలుగా ఊహించుకుంటున్నారు. తన పోస్టు వివాదానికి దారి తీయడంతో వెంటనే వివరణ ఇచ్చాుకున్నాడు వరుణ్ తేజ్. ఇంటర్నెట్లో ఆసక్తికరంగా ఉండటంతో ఆ పోస్టు చేసాను. అంతకు మించి ఆ పోస్టుకు రాజకీయ ఉద్దేశ్యాలు, సెటైర్లు ఆపాదించొద్దు అని వరుణ్ తేజ్ స్పష్టం చేసారు.

వరుణ్ తేజ్ సినిమా వివరాల్లోకి వెళితే....వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా ప్రారంభమైంది. మెగా రేంజికి తగిన విధంగా గ్రాండ్‌గా ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది. కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది.

గతంలో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'కొత్త బంగారు లోకం' లాంటి చిత్రాలను తెరకెక్కించిన అనుభవం ఉన్న శ్రీకాంత్ అడ్డాల వరుణ్ తేజ్ మొదటి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లియో ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

English summary
Naga Babu son Varun Tej seems to have courted fresh controversy. He shared a picture on his twitter wall, which raised many eyebrows.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu