ఫన్ మొదలైంది.. లుంగీలో దర్శనమిచ్చిన వరుణ్ తేజ్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మంచి జోరు మీద ఉన్నాడు. సంకల్ప్ రెడ్డి దర్శకతంలోని చిత్రం సెట్స్ పై ఉండగానే మరో చిత్రాన్ని షురూ చేశాడు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ నేడు ప్రారంభమైంది.
ఈ చిత్ర టైటిల్ ఎఫ్2. ఫన్ అండ్ ప్రస్ట్రేషన్ అనేది ట్యాగ్ లైన్. షూటింగ్ లొకేషన్ లో వరుణ్ తేజ్, కమెడియన్ ప్రియదర్శి లుంగీలో దర్శనమిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందించనున్నారు.
ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. మరో కొత్త అధ్యాయం ప్రారంభమైందని ట్వీట్ చేశాడు. ఈ ఆసక్తికరమైన మల్టీస్టారర్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వరుణ్ కు జోడిగా మెహ్రీన్, వెంకీ సరసన తమన్నా నటిస్తున్నారు.



Click it and Unblock the Notifications











