వరుణ్ తేజ్, వెంకీ మల్టీస్టారర్ ప్రారంభం రేపే!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ చిత్రానికి ముహూర్తం కుదిరింది. హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. శనివారం జూన్ 23 న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం విశేషం.
అనిల్ రావిపూడి చిత్రాలలో ఎక్కువగా వినోదానికి ప్రాధాన్యత ఉంటుంది. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ వంటి చిత్రాలతో ఈ దర్శకుడు ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించాడు. వెంకీ, వరుణ్ తో రూపొందించబోయే ఎఫ్2 చిత్రం కూడా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కుతోంది.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇటీవల అనిరావిపూడి, దేవిశ్రీ కలసి మ్యూజిక్ సిట్టింగ్స్ జరిపారు. వెంకీ, వరుణ్ తేజ్ లకు జోడీలుగా తమన్నా, మెహ్రీన్ నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











