ఛేంజ్ చెప్పాడే కానీ రామ్ చరణ్ విషయం తేల్చలేదు
హైదరాబాద్: వరుణ్‌తేజ్, ప్రజ్ఞా జైస్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కంచె'. సెప్టెంబర్ 17న వినాయకచవితి సందర్భంగా విశాఖపట్టణంలో విడుదల చేయాల్సిన ఈ చిత్రం ఆడియోను కొన్ని సాంకేతిక కారణాల వల్ల హైదరాబాద్‌లో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని వరుణ్‌తేజ్ తన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఎక్కౌంట్ల ద్వారా తెలిపారు. ఆ ట్వీట్ ని ఇక్కడ చూడండి.
అయితే గెస్ట్ గా వస్తారన్న రామ్ చరణ్ విషయం ఎక్కడా ప్రస్దావించలేదు. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2న 'కంచె' ప్రేక్షకుల ముందుకు రానుంది.
'ముకుంద' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ రెండో సినిమా 'కంచె'. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆయన తండ్రి జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యి..విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియోని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

ఇంతకు ముందు నిర్మాతలు ఈ చిత్రం ఆడియోని సెప్టెంబర్ 17న వైజాగ్ లో విడుదల చేయనున్నట్లు అఫిషియల్ ప్రకటన చేసారు. అయితే అందుతున్న సమచారం ప్రకారం మెగా మార్పు చోటు చేసుకుంది. ఈ ఆడియో పంక్షన్ ని హైదరాబాద్ కే షిప్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పంక్షన్ కు రామ్ చరణ్ గెస్ట్ గా హాజరు అవుతారని తెలుస్తోంది. అయితే ఈ విషయమై అఫీషియల్ ఎనౌన్సమెంట్ అయితే ఇప్పటివరకూ లేదు. త్వరలో వచ్చే అవకాసం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే రిలైజన ట్రైలర్ అందరి మన్ననలూ పొందుతోంది. ఆ ట్రైలర్ ఇదిగో...
ఇక కంచె చిత్రం కథ పుట్టిన విధం గురించి దర్శకుడు మాట్లాడుతూ.... 'వేదం' చిత్రీకరణ సమయంలో నేనూ, అల్లు అర్జున్ విశాఖపట్నం వెళ్లాం. అక్కడ నేవీ మ్యూజియంలో ఓ బాంబు చూశాం. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 1942 ఏప్రిల్ 6న విశాఖపట్నంలోని రెండువేల టన్నుల మందుగుండు సామాగ్రితో వెళ్తున్న నౌకను లక్ష్యంగా చేసుకొని జపాన్ వాళ్లు ఆ బాంబును సంధించారు. అయితే.. అదృష్టవశాత్తూ అది పేలలేదు. లేదంటే చరిత్ర మర్చిపోలేని చేదు జ్ఞాపకాల్ని మిగిల్చిన సంఘటన జరిగేది. అంతకుముందు రెండో ప్రపంచయుద్ధం అంటే మనకు సంబంధం లేని వ్యవహారం అనుకునేవాణ్ని.
ఆ బాంబు చూశాక నాలో కొత్త ఆలోచన రేకెత్తింది. 'వేదం'ను తమిళంలో 'వానం' పేరుతో తెరకెక్కిస్తున్నప్పుడు లొకేషన్లకోసం కారైకూడి వెళ్లాం. అక్కడ ఓ చెట్టియార్ ఇల్లు కనిపించింది. అందులో సైనికులకు సంబంధించిన చిత్రపటాలు, వాళ్లకొచ్చిన మెడల్స్, విక్టోరియా రాణి పంపిన ధ్రువపత్రాలూ ఉన్నాయి. వాటిని చూశాక మరింత ఆసక్తి కలిగింది. రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశపు ప్రాతినిధ్యం ఎంత అనే విషయం స్పష్టంగా అర్థమైంది. దాదాపు పాతిక లక్షలమంది భారతీయులు ఈ యుద్ధంలో పాల్గొన్నారు.
దాదాపు 24వేల మంది మరణించారు. 65 వేలమంది క్షతగాత్రులయ్యారు. 11 వేల సైనికుల ఆచూకీ లభించలేదు. ఈ అంకెలు నన్ను విస్మయపరిచాయి. ఈ నేపథ్యంలో ఓ అందమైన ప్రేమ కథ చెప్పాలనిపించింది. ఆ ప్రయత్నం 'కంచె'లో చేశాం. మనుషులంటే పంచుకొని బతకాలి, కంచెలేసుకొని కాదు... అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా చెబుతున్నాం'' అన్నారు క్రిష్.


Click it and Unblock the Notifications











