పెళ్లి తరువాత నితిన్ స్పీడ్ పెంచాడు.. చెక్ బాక్సాఫీస్ హిట్ గ్యారెంటీ: వరుణ్ తేజ్

భీష్మ సినిమాతో గత ఏడాది బాక్సాఫీస్ హిట్ అందుకున్న నితిన్ ఈ సారి మరో డిఫరెంట్ సినిమాతో ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆదివారం సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. వేడుకలో వరుణ్ తేజ్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు.

Recommended Video

Nithiin's Check Movie Release Date Revealed | Filmibeat Telugu
 డ్రీమ్ బిగ్.. అనేది చూపించారు

డ్రీమ్ బిగ్.. అనేది చూపించారు

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన రాజమౌళి గారి గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఫస్ట్ టైమ్ ఆయన గురించి మాట్లాడే అవకాశం దొరికింది. చిన్నప్పుడు నుంచి ఆయన సినిమాలు చేస్తూ పెరిగాము. అందరికి డ్రీమ్ బిగ్ అనేది చూపించారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు.. అని చెప్పారు.

 చెక్ ..బిగ్గెస్ట్ హిట్

చెక్ ..బిగ్గెస్ట్ హిట్


ఇక నితిన్ గురించి చెప్పాలి అంటే.. తను నాకు మంచి ఫ్రెండ్. జనరల్ గా పెళ్ళైన తరువాత కొంచెం స్లో అవుతారు. కానీ నితిన్ వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టి మాకు చెక్ పెట్టాడు. నితిన్ ట్రాఫిక్ ఎక్కువ చేశాడు అని వరుణ్ సరదాగా మాట్లాడారు. నితిన్ మొదటి నుంచి కూడా చాలా కమిటెడ్ గా ఉన్నాడు. సినిమా తప్పకుండా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అనుకుంటున్నాను..అని వరుణ్ తెలిపారు

అందరికి నా బెస్ట్ విషెస్

అందరికి నా బెస్ట్ విషెస్

అలాగే ఈ సినిమాలో మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు. సంపత్ గారికి అలాగే, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ లాంటి స్టార్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విశేష్ అందిస్తున్నాన్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ గారికి కూడా బెస్ట్ విషెస్ అందిస్తున్నాను..అని తెలిపారు.

ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే ..

ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే ..

చంద్రశేఖర్ యేలేటి గురించి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే చాలా ఆసక్తిగా ఉండేది. యూత్ లో ఆయన సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక నమ్మకం కూడా ఉంది. చెక్ అనే సినిమా కూడా ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. క్రాక్ సినిమాతో ఈ ఏడాది టాలీవుడ్ కు మంచి ఓపెనింగ్స్ ఇచ్చిన ఆడియెన్స్ కు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అదే విధంగా చెక్ సినిమాకు కూడా మంచి సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను.. అని వరుణ్ తేజ్ మాట్లాడారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X