అల్లరి నరేష్ అర్దం కావటం లేదంటున్న యంగ్ హీరో
అల్లరి నరేష్ నాకు మంచి స్నేహితుడు. ఆయన సంవత్సరానికి అన్ని సినిమాలు ఎలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు అంటున్నాడు వరణ్ సందేశ్. బుధవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మాస్ ప్రేక్షకులకు చేరువకావాలంటే మాస్ సినిమాలే చేయనక్కర్లేదు. మంచి సినిమాలు చేసినా ఆదరిస్తారన్నారు. రాజమౌళి సినిమాలో హీరోగా అవకాశం వస్తే..అంతకంటే ఇంకేం కావాలి అన్నారు. అలాగే 'హ్యాపీడేస్' తరవాత నేను చేసిన సినిమాల దర్శకులందరూ కొత్తవాళ్లే. వాళ్లతో ఎక్కడా ఇబ్బందిపడకుండా సరదాగానే సినిమాలు పూర్తిచేశాను. హీరోగా గా కంటే కూడా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే నాకిష్టం. ఓ ఇరవయ్యేళ్ల తర్వాత కూడా నా పిల్లలకు గర్వంగా నా సినిమా చూపించుకోగలగాలి. నాకు రొమాంటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలంటే ఇష్టం అని చెప్పుకొచ్చాడు.ఇక సినిమా జయాపజయాలు మన చేతుల్లో లేవు. ప్రేక్షకులే నిర్ణయిస్తారు. హిట్ కంటే కూడా ఫ్లాప్ సినిమా నుంచే ఎక్కువ విషయాలు నేర్చుకోవచ్చు. నాకెదురయ్యే అనుభవాలను కెరీర్ మరింత చక్కగా ఉండటానికి వీలుగా మార్చుకుంటా అని చెప్పుకొచ్చాడు.ధట్స్ తెలుగు ఈ యువ హీరోకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











