హీరో ఎయిట్ ప్యాక్ తిప్పలు

తమిళంలో ధనుష్ హీరోగా చేసిన 'పొల్లాదవాన్' సినిమా రీమేక్ ఇది. జెమెనీ ఫిల్మ్ సర్క్యూట్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కథ ప్రభు అనే ఓ తెలివైన బద్దకస్దుడైన కుర్రాడు చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడూ స్నేహితులతో తిరిగే అతనికి ఓ బైక్ కొనుక్కోవాలనే తీరని కోరిక ఉంటుంది. అయితే నిజాయితీ పరుడైన తండ్రి సంపాదన ఆ అవకాశమివ్వదు.అయితే అతను ఓ రోజు తండ్రితో డబ్బుకోసం గొడవపడి యాభై వేలు సాధిస్తాడు.
దాంతో బైక్ కొనుక్కుని..వెంటనే బ్యాంక్ జాబ్ సంపాదించి...బస్టాప్ లో పరిచయమైన పిల్లతో ప్రేమలో పడతాడు. అంతా సెటిల్ అయిందనుకున్న సమయంలో అతని బైక్ దొంగతనం జరుగుతుంది. అతని జాబ్ పోతుంది. అతని గర్ల్ ప్రెండ్ ఛీ కొడుతుంది. అక్కడనుండి అతను ఆ బైక్ ని పట్టుకునే ప్రయాణంలో ఓ డాన్ తో తలపడాల్సి వస్తుంది. అక్కడ నుండి కథ డార్క్ సైడ్ కి వెళుతుంది. ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో నడిచే ఈ చిత్రం టెక్నికల్ గా సౌండ్ గా ఉంటుంది. 'కొత్త బంగారులోకం' హిట్ తో ఉన్న వరుణే్ ఎవియం వారి సినిమాలలోనూ హీరోగా చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











