మెగా కుటుంబం పేరు నిలబెడతా

By Srikanya

మొగల్రాజపురం: లియో ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఠాగూర్‌ మధు సమర్పించిన 'ముకుంద' చిత్రాన్ని మెగా కుటుంబం అభిమానులు విజయవంతం చేయడంపై ఎంతో ఆనందంగా ఉందని ఆ చిత్ర హీరో వరుణ్‌తేజ్‌ అన్నారు. ఆదివారం సాయంత్రం మొగల్రాజపురం పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డులోని సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాంగణంలో భారీగా తరలివచ్చిన మెగా అభిమానుల మధ్య నిర్వహించిన ముకుంద చిత్రం సక్సెస్‌మీట్‌లో ఆయన పాల్గొని అభిమానులను ఉత్సాహపరిచారు.

https://www.facebook.com/TeluguFilmibeat

చిత్రాన్ని విజయవంతం చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మెగా కుటుంబం పేరు నిలబెడతానంటూ హామీ ఇచ్చారు. చిత్ర నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల మాట్లాడుతూ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులు, మెగా కుటుంబం అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. నటుడు రావు రమేష్‌ మాట్లాడుతూ మెగాస్టార్‌ చిరంజీవితో నటించాలని ఉందని ఆకాంక్షను వెలిబుచ్చారు.

Varunteja happy with Mukunda

అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీమోహన్‌లు మాట్లాడుతూ నగరం రాజధాని అయిన నేపధ్యంలో సినిమాల వేడుకలు, షూటింగులను ఇక్కడే నిర్వహించేందుకు అందరు నిర్మాతలు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా చిత్రంలోని పాటలకు కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. డీటీస్‌ ఆనంద్‌ నోటితో సంగీతం ఆలపిస్తూ అభిమానులను అలరించారు.

క్రిస్మస్ సందర్బంగా ముకుందా చిత్రం విడుదలైంది. వరుణ్‌తేజ్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం ముకుందా. లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. ఠాగూర్ మధు సమర్పకుడు.

దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ... యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది. పల్లెటూరి అనుబంధాలు, ప్రేమలు, రాజకీయాలు యువతరంపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతున్నాయనే అంశాన్ని ఈ చిత్రంలో చూపించాం. ఎలాంటి అంశాలకు ప్రభావితం కాని ఓ కుర్రాడి జీవితం ప్రేమ కారణంగా ఎన్ని మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

ఇదివరకు నేను తెరకెక్కించిన చిత్రాలకి భిన్నంగా యాక్షన్‌కి ప్రాధాన్యమిస్తూ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. ప్రతీ సన్నివేశం సహజంగా కనిపించాలని భీమవరం, అమలాపురం, తాడేపల్లిగూడెం, ద్రాక్షారామం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. యువతరం భావోద్వేగాల్ని ప్రతిబింబిస్తూ సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతోంది. వరుణ్‌తేజ్ నటన, పూజా హెగ్డే గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''ఒక చిన్న పట్టణం నేపథ్యంలో సాగే కథ ఇది. ముకుంద అనే ఓ యువకుడి ప్రేమపై స్థానిక పరిస్థితులు ఎలాంటి ప్రభావం చూపించాయి? వాటి నుంచి బయట పడేందుకు అతను ఏం చేశాడు? అనే విషయాలు ఆసక్తికరం. వరుణ్‌తేజ్‌ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X