‘వసూల్ రాజా’ డీటేల్స్..
శ్రీహరి, నవదీప్, రీతూ బర్మేచా కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'వసూల్ రాజా'. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడు. బి.ఎం సూడియోస్ పతాకంపై బత్తుల రతన్‌పాండు. మహంకాళి దివాకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 22 నుంచి ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా హైదరాబాద్‌లోని జరుగుతోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'శ్రీహరి, నవదీప్, రీతూ బర్మేచా, సత్యం రాజేష్, గీతా భగత్ తదితరులుపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. హైదరాబాద్‌తో పాటు వైజాగ్‌లో కూడా చిత్రీకరణ జరుపనున్నాం. అక్టోబర్‌కి షూటింగ్ పూర్తవుతుంది. నవంబర్లో చిత్రాన్ని విడుదల చేస్తాం' అని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ...'ఇది పక్కామాస్ ఎంటర్ టైనర్. శ్రీహరి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇందులో నవదీప్‌ది చాలా మాస్ కేరక్టర్. ఆయనకిది టైలర్ మేడ్‌లా అనిపిస్తుంది. శ్రీహరి, నవదీప్‌ల మధ్య సన్నివేశాలు చాలా పోటీపోటీగా ఉంటాయి. ఇందులో 5 పాటలు ఉంటాయి. చిన్ని చరణ్ చక్రటి పాటలిచ్చారు. రామస్వామి సంబాషణలు కూడా ఆకట్టుకుంటాయి' అని చెప్పారు. బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : కృష్ణ ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : యారబాటి శివ, నృత్యాలు : శేఖర్


Click it and Unblock the Notifications












