మంచు విష్ణువర్ధన్ 'వస్తాడు నా రాజు' డైరక్టర్ తిరోగమనం..
మంచు విష్ణు వర్ధన్ తో వస్తాడు నా రాజు చిత్రం రూపొందించిన హేమంత్ మధుకర్ ఆ చిత్రం ప్లాప్ కావటంతో డైలమోలో పడ్డారు. తెలుగులో ఇక ఆఫర్స్ రావని అర్దం చేసుకున్న ఈ దర్శకుడు తన మొదటి సినిమా చేసిన బాలీవుడ్ కే ప్రయాణం కట్టుకున్నాడు. హేమంత్ మొదట హిందిలో ప్లాట్ అనే హర్రర్ చిత్రం చేసాడు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తర్వాత తెలుగులో వస్తాడు నా రాజు చిత్రం రూపొందించి ఇక్కడా పరాజయం పొందాడు. అయితే వెంటనే మరో ప్రాజెక్టు స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్న హేమంత్...7 కలర్స్ ఆఫ్ లవ్ అనే చిత్రం హిందీలో చేయాలని అక్కడ ఓ నిర్మాతను పట్టాడు. నటీనటులు ఇంకా ఫైనలైజ్ కాని ఈ చిత్రం కుర్రకారుని టార్గెట్ చేసి రూపొందిస్తానని అప్పుడే చెప్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రమైనా అతన్ని నిలబెడుతుందని ఆశిద్దాం.
వస్తాడు నా రాజు విష్ణువర్దన్ తాప్సీ హేమంత్ మధుకర్ vastadu naa raju vishnuvardhan tapsi hemanth madhukar


Click it and Unblock the Notifications