రామ్ గోపాల్ వర్మ 'వాస్తు శాస్త్ర' దర్శకుడు మృతి
రామ్ గోపాల్ వర్మ శిష్యుడు 'వాస్తు శాస్త్ర' (మర్రి చెట్టు తెలుగు డబ్బింగ్) దర్శకుడు సౌరభ్ నారంగ్ స్టమక్ కాన్సర్ తో శ్రీలంక కొలంబోలో శనివారం(26 జూన్) మరణించారు. ముప్పై ఏడు సంవత్సరాల వయస్సు ఉన్న సౌరభ్ యువకుడుగా ఉన్నప్పుడే చిత్రం డైరక్ట్ చేసి అందరి మన్ననలూ పొందారు. ప్రస్తుతం ఆయన రిటర్ట్స్ గిప్ట్ అనే చిత్రం ప్లాన్ చేసుకున్నారు. అలాగే సౌరభ్ ఇంతకుముందు హకీకత్, ఉష్ కోయీ హై వంటి టీవీ షోలకు క్రెడిట్ ఉంది. ఇక 2002లో ఇచ్చిన ఓ ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ...పదేళ్ళ తర్వాత ఈ ఫీల్డ్ లో ఎలా ఉండాలనుకుంటున్నారు అంటే...ఆయన కో ఇన్సిడెంటల్ గా...ఏమో అప్పటికి నేను చచ్చిపోతానేమో అన్నారు. ఈ విషయం తలుచుకుని ఆయన స్నేహితులు చాలా భాధపడుతున్నారు. మహేష్ భట్, మధూర్ బండార్కర్ వంటి ఆయన పరిచయస్తులు ఈ యువ దర్శకుడు హఠాత్ మరణానికి సంతాపం వ్యక్తం చేసారు. ధట్స్ తెలుగు ఈ యువ దర్శకుడుకి అంతిమ నివాళులు అర్పిస్తోంది.


Click it and Unblock the Notifications











