వెంకటేష్ తాజా చిత్రం రూమర్స్ పై దర్శకుడు క్లారిఫికేషన్
వెంకటేష్ తాజా చిత్రం చంద్రముఖి-2 పై వస్తున్న రూమర్స్ ని దర్సకుడు పి.వాసు కొట్టిపారేశారు. అలాగే నాగవల్లి ఆత్మ యూనిట్ సభ్యులను భయపెడుతోందనే విషయాన్ని ఆయన నవ్వి తీసిపారేశారు. ఈ విషయమై మాట్లాడుతూ..ఆప్త రక్షక జరుగుతున్నప్పుడు సౌందర్య, ఆప్త రక్షక జరుగుతున్నప్పుడు విష్ణు వర్ధన్ చనిపోయారు అని జనం అనుకుంటున్నారు. అయితే అది నిజం కాదు. సినిమాలు షూటింగ్ పూర్తయ్యి , రిలీజ్ అయ్యాక మాత్రమే వారు చనిపోయారు. కాబట్టి సినిమాకు వారి మరణాలకూ ఏ మాత్రం సంభంధం లేదు. అలా అనుకుంటే రీసెంట్ గా తమిళ హీరో మురళి..హార్ట్ ఎటాక్ తో మరణించారు. అంత మా చిత్రంలో నటించలేదే. కాబట్టి నిజ జీవితంలో జరిగే వాటికీ, ఫిక్షన్ తో కూడిన సినిమాకి ముడి పెట్టడం అనవసరం అన్నారు.
ఇక వెంకటేష్, పి.వాసు కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి నాగవల్లి అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుపకుంటున్న ఈ చిత్రం ఆడియోను ఈ నెలాఖరున విడుదల చేసి, చిత్రాన్ని నవంబర్ 11న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. పి.వాసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా అనూష్క చేస్తోంది. చింతకాయల రవి తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇదే. ఇక ఈ పీరియాడిక్ ధ్రిల్లర్ లో వెంకటేష్ వృధ్దుడు గెటప్ లో కూడా కనిపించనున్నాడని సమాచారం. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే ఈ చిత్రంలో అనూష్కతో పాటు కమలినీ ముఖర్జీ, శ్రద్ధాదాస్, పూనమ్ కౌర్, రిచా గంగోపాధ్యాయ వెంకీతో ఆడిపాడతారు సాంకేతికంగా ఉన్నత విలువలతో తీర్చిదిద్దుతున్న ఈ చిత్రంలో 'లక లక లక లక' డైలాగుని 'లీడర్' చిత్రంతో పరిచయమైన రిచా గంగోపాధ్యాయ చెప్తోంది.


Click it and Unblock the Notifications











