ఆ క్రేజీ ప్రాజెక్టుకు దర్శకుడు పూరీ కాదా?

వాసూ వర్మ బొమ్మరిల్లు సినిమాకు పనిచేసాడు. సినిమా ప్రారంభంలో అతనికి స్పెషల్ ధాంక్స్ చెబుతూ కార్డు కూడా పడుతుంది. అతను గత రెండు సంవత్సరాలగా పూర్తిగా స్క్రిప్టు పనిలోనే నిమగ్నమైనట్లు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు అతనికి ఈ రెండు సంవత్సారాలుగా పూర్తి స్థాయి ఆర్ధిక సాయం అందిస్తూ వస్తున్నారు. దాంతో ఆ కథ అధ్బుతంగా వచ్చిందని ఈ సంవత్సరంలోనే దాన్ని దిల్ రాజు బ్యానర్ పైనే తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. నాగార్జున పుట్టిన రోజున ఈ ప్రకటన రావచ్చునని అంటున్నారు. ఇంతకీ పూరీని మార్చటానికి కారణం బుజ్జిగాడు పరాజయమా లేక పూరీ ఖాళీ లేనంత బిజీ అవటమా అనే ప్రశ్న అందరినీ తొలుస్తోంది.


Click it and Unblock the Notifications











