వయసుకు వచ్చామంటున్న తనీష్, నీతి

By Bojja Kumar

తనీష్‌-నీతి టేలర్‌ జంటగా నటించిన చిత్రం 'మేం వయసుకు వచ్చాం'. మదాలస శర్మ మరో నాయిక. భాగ్యరాజా కీలకపాత్రధారి. త్రినాధరావు నక్కిన దర్శకుడు. లక్ష్మణ్‌ సినీవిజన్స్‌ సమర్పణలో లక్కిమీడియా పతాకంపై తెరకెక్కుతోంది. బెక్కం వేణుగోపాల్‌, లక్ష్మణ్‌ కేదారి నిర్మాతలు. బసిరెడ్డి, గంటా నాగేశ్వరరావు సహనిర్మాతలు. చిత్రీకరణ పూర్తయి ప్రస్తుతం నిర్మాణానంతర పనులు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. ట్రైలర్స్‌ సహా పాటలు ఇప్పటికే అలరిస్తున్నాయి. ఎడిటింగ్‌, డబ్బింగ్‌, గ్రాఫిక్స్‌ పనులు ఏకకాలంలో చేస్తున్నాం. వచ్చే వారంలో ఆడియో, త్వరలో సినిమా రిలీజ్‌ చేస్తాం. తనీష్‌కి మేలిమలుపు నిచ్చే ఈ సినిమాలో భాగ్యరాజా పాత్ర ప్రత్యేక ఆకర్షణ'' అన్నారు.

రమాప్రభ, సూర్య, సన, రక్ష, కాశీ విశ్వనాథ్‌, రక్ష, అనితానాధ్‌, స్నిగ్ధ, పూనమ్‌ శర్మ, తాగుబోతు రమేష్‌ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: శేఖర్‌చంద్ర, కెమెరా:సాయి శ్రీరామ్‌, పాటలు: భాస్కరభట్ల, మాటలు: నివాస్‌, ఎడిటింగ్‌: పూడి ప్రవీణ్‌, కళ: వర్మ, డాన్స్‌: స్వర్ణ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: హరిత మేడిశెట్టి, సహనిర్మాతలు: డిజిక్వెస్ట్‌ బసిరెడ్డి-గంటా నాగేశ్వరరావు, కథ-కథనం-దర్శకత్వం: త్రినాధరావు నక్కిన.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X