మీరు నటించిన ఆ మూడు సినిమాలు చూశా.. రాంచరణ్, రాజమౌళికి సజ్జనార్ ప్రశంసలు
సైబరాబాద్ పరిధిలోని పోలీసు బలగాల కోసం నిర్వహించిన మూడో స్పోర్ట్స్ మీట్ ముగిసింది. ఈ ముగింపు ఉత్సవాల్లో సైబారాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రసంగం ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. ఈ ముగింపు ఉత్సవాలకు హాజరైన మెగా పవర్ స్టార్ రాంచరణ్‌పై సజ్జనార్ చేసిన ప్రశంసలు మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఈ ముగింపు సమావేశాల్లో సజ్జనార్ చేసిన ప్రసంగం వివరాలు మీ కోసం...

రాంచరణ్ క్విక్ రియాక్షన్
సైబారాబాద్ పోలీస్ స్పోర్ట్స్ ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని రాంచరణ్‌ను కోరాను. అయితే తాను దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న RRR మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాల్లో నటిస్తున్నాను. త్వరలోనే మీకు కన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పారు. కానీ మరుసటి రోజే తాను వస్తున్నట్టు ధృవీకరించారు అని సజ్జనార్ తెలిపారు.

రాజమౌళికి థ్యాంక్స్
గత నాలుగు రోజులుగా 500 మంది పోలీసులు, వారి కుటుంబాలు పాల్గొన్న స్పోర్ట్స్ మీట్‌కు రాంచరణ్ హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ముగింపు ఉత్సవాలకు రాంచరణ్ హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించిన రాజమౌళికి కూడా థ్యాంక్స్ చెబుతున్నాను అని సైబారాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు.

ఫ్యామిలీతో కలిసి చిరంజీవి సైరా చూశా
తనకు ఎక్కువగా సినిమాలు చూసే అలవాటు లేదు. కానీ నా కుటుంబ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా రిలీజ్ అయిందని తెలియజేస్తే.. కాస్త సమయం చేసుకొని ఏఎంబీ మాల్‌లో ఆ చిత్రాన్ని చూశానని ఈ సందర్భంగా సజ్జనార్ గుర్తు చేసుకొన్నారు.

రాంచరణ్ నటించిన ఆ మూడు సినిమాలంటే..
ప్రొఫెషనల్‌గా విధుల కారణంగా తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. అయితే విధులకు కాస్త విరామం ఇచ్చి రాంచరణ్ నటించిన సినిమాల్లో మూడింటిని చూశాను. మగధీర, ధృవ, రంగస్థలం సినిమాలు నాకు బాగా నచ్చాయి అని ఈ సందర్భంగా రాంచరణ్‌ను సజ్జనార్ ప్రశంసించారు.
Recommended Video

విజేతలకు రాంచరణ్ బహుమతులు
జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగిన మూడో సైబారాబాద్ స్పోర్ట్స్ మీట్ ముగింపు ఉత్సవాలకు రాంచరణ్‌తోపాటు ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్ పాల్గొన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్‌లో విజేతలకు రాంచరణ్, నాగపూరి రమేష్ బహుమతులు అందించారు.


Click it and Unblock the Notifications











